పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 23 February 2016

జేఎన్‌యూలో ఆ ఐదుగురు

  • మేం ఎలాంటి తప్పు చేయలేదు 
  • దేశదోహ్రం కేసు నమోదైన విద్యార్థుల ఆవేదన జేఎన్‌యూ ఘటనలో దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం రాత్రి వర్సిటీ ప్రాంగణంలో ప్రత్యక్షమయ్యారు. ఫిబ్రవరి 12న జేఎన్‌యూ విద్యార్థినేత కన్నయ్య కుమార్‌ని పోలీసులు అరెస్ట్‌ చేసిన తర్వా త ఉమర్‌ ఖలీద్‌, అనిర్బన్‌ భట్టాచార్య, రామా నాగా, అశుతోష్‌ కుమార్‌, అనంత ప్రకాశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి వర్సిటీకి వచ్చిన వీరు విలేకరులతో మాట్లాడారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఎడిట్‌ చేసిన వీడియో దృశ్యాల ఆధారంగా తమపై కేసు నమోదు చేశారని తెలిపారు. అక్రమ అరెస్టులు, కేసులకు భయపడి తాము ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్నామన్నారు. ఉమర్‌ ఖలీద్‌ మాట్లాడుతూ.. తనను ఉగ్రవాదిగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన నలుగురు విద్యార్థులు మాట్లాడుతూ..ఫిబ్రవరి 9న వర్సిటీలో జరిగిన కార్యక్రమానికి బయటి వ్యక్తులు వచ్చారన్నారు. వారిలో కొందరు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆరోపించారు. కాగా, ఐదుగురు విద్యార్థులు వర్సిటీలో ప్రత్యక్షమైన అంశాన్ని చర్చించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు సోమవారం అత్యవసర భేటీ నిర్వహించారు. కాగా, దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిని, నినాదాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజా కమ్యూనిస్టు నేత డి.రాజా కుమార్తెపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. కాగా, ప్రతిష్ఠాత్మకమైన జేఎన్‌యూలో సుమారు నెలరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తరగతుల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా 80 శాతం సిలబ్‌సను కేవలం నెలరోజుల్లో పూర్తిచేయాల్సిన పరిస్థితి నెలకొంది.

No comments:

Post a Comment