పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

హైదరాబాద్‌కు విస్తరించిన పెర్సిస్టెంట్‌


హైదరాబాద్‌ : సాప్ట్‌వేర్‌ సంస్థలు, ఎంటర్‌ ప్రైజ్‌ సొల్యూషన్స్‌ ఐటి కంపెనీ పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఐటిరంగ పరంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎంతో వృద్ధి సాధిస్తున్నందున ఈ ప్రాంతం తమకు అత్యంత కీలకమైన మార్కెట్‌ అని సంస్థ వ్యవ స్థాప కులు ఎండి డాక్టర్‌ ఆనంద్‌దేశ్‌పాండే వెల్లడించారు. డిజిటల్‌ ఇండియాలో ఉన్న పటిష్టమైన ఆసక్తిని ప్రతిబింబిస్తున్నదన్నారు ఆర్థికసేవలు, జీవివిజ్ఞానం, సిస్టమ్స్‌ ఇంటిగ్రేషన్‌ వంటివన్నీ చేరువలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో తమ సిబ్బందిని 2017 నాటికి రెట్టింపుచేస్తామని ఆయన ప్రకటించారు. వేవ్‌రాక్‌సెజ్‌లోని కొత్త కేంద్రంలో పర్‌సిస్టెంట్‌ సిస్టమ్స్‌ కార్యాలయం పనిచేస్తుందని దేశ్‌పాండే వెల్లడించారు. డిజైన్‌ రూపకల్పన, డిజిటల్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ హెల్త్‌కేర్‌రంగాల్లో సంస్థ సేవలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. కొత్త కేంద్రం ప్రారంభం సంద ర్భంగా కస్టమర్లు, డిజిటల్‌ ఆలోచనలున్న ప్రముఖులు వ్యక్తులకోసం సంస్థ డిజిటల్‌డేను నిర్వహించింది.

No comments:

Post a Comment