విజయవాడ్: ఇక్కడి ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఎపి మెడికల్ కౌన్సిల్ కార్యాలయాన్ని గురువారం మంత్రి కామినేని ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయనమాట్లాడుతూ, పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా మెడికల్ కౌన్సిల్ సభ్యులకు సూచనలు చేశారు.రాష్ట్రంలో నర్సులు, వైద్యుల పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపడతామని అన్నారు. మార్చి 8 నుంచి గర్భిణీలకు రెండు పర్యాయాలు ఉచితంగా అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 7 నుంచి విశ్‌ాఖలో వైద్యపరికరాల తయారీ పార్కును ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలల్లో సిబ్బంది హాజరుకోసం బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు.
No comments:
Post a Comment