పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

బుల్లెట్‌లా దూసుకుపోతాం


కేంద్రం అందజేస్తున్న సహకారంతో రాష్ట్రంలో అనేక పథకాలు ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం పట్టణంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఎం వెంకయ్యనాయుడుతో కలిసి వచ్చిన అయన పాత పశువుల సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రశంగించారు. సభకు రాష్ట్రవ్యవసాయశాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షత వహించారు. సీఎం మాట్లాడుతూ రాష్ట్రవిభజన అనంతరం అనేక సమస్యలను ఎదుర్కొవలసివచ్చిందని తెలిపారు. సమస్యలు ఉన్నప్పటికి ప్రజా సంక్షేమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టామని, కేంద్రం కూడా సహయసహకారులు అందిస్తుందని వివరించారు.
రాజకీయ చైతన్యానికి మారుపేరు చిలకలూరిపేట..
చిలకలూరిపేట పట్టణం రాజకీయచైతన్యానికి మారుపేరుని తెలిపారు. రాజధాని అమరావతికి సమీపాన ఉన్న పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధిపథంలో ముందంజలో నియోజకవర్గంలో నిలవటమే కాక ,స్వచ్చ అంద్ర పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కొనసాగించి బహిరంగ మలవిజర్జన లేని నియోజకవర్గంలో నిలిచిందన్నారు. చిలకలూరిపేట పేరును ప్రస్తావిస్తూ ఏ విధంగా చిలకలూరిపేటకు అపేరు వచ్చిందో వివరించారు. అన్ని రంగాల్లో చిలకలూరిపేట నిలిచిందని కొనియాడారు. మోడల్‌ పోలీస్‌ను అత్యంత అధునికంగా తీర్చిదిద్దారని, స్మార్ట్‌ పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేసుకొన్న పోలీసు ప్రజల పట్ల కూడా స్మార్ట్‌గా వ్యవహరించాలని కోరారు. గతంలో మురికికూపంగా ఉండే మున్సిపాలిటి స్వచ్చచిలకలూరిపేటగా నిలిచిందన్నారు. చిలకలూరిపేటకు బైపాస్‌ రోడ్డు మంజూరైందని, రెండు సంవత్సరాల్లో ఇది పూర్తి అవుతుందన్నారు. దీనివలన అభివృద్ధి సాధ్యమౌతుందన్నారు.
కేంద్రం సహకారంతో..
దేశవ్యాప్తంగా 20 స్మార్ట్‌ మున్సిపల్‌ కార్పోరేషన్లు ప్రకటిస్తూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, కేంద్రం సహకారంతో రాష్ట్రంలో తిరుపతి,విశాఖపట్నం రెండు ఎంపికయ్యాయని తెలిపారు. భారత దేశంలో పరిశుభ్రతకల కార్పోరేషన్లు రేటింగ్‌ ఇస్తే రాష్ట్రంలోని విశాఖపట్నం ఐదో స్థానంలోనూ, విజయవాడ 23 స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. అందరికి ఇళ్లు కేంద్రప్రభుత్వ పథకంలో కూడా రాష్ట్రానికి వేలాది ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.
కష్టాలను అధికమించి ముందుకు..
రాష్ట్రవిభజన అనంతరం అనేక కష్టాలను ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి వివరించారు. 42 శాతం ఉండే తెలంగాణాకు 52 అదాయం ఉంటే, 58 శాతం ఉన్న అంద్రకు కేవలం 46శాతం అదాయం లభించిందన్నారు. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, అదాయం తక్కువ గా ఉన్న సయయంలో ఇబ్బందులు పడ్డాం. కేంద్రం అదుకుంటునే దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. పేదవాడికి పేద్దకొడుకుగా ఉంటానని చెప్పిన విధంగా రూ.వెయ్యి రూపాయల పించన్‌అందజేస్తున్నట్లు వివరించారు. పించన్‌, రేషన్‌ సరుకులు ఎక్కడినుంచైనా తీసుకొనే ఏర్పాటు చేశామన్నారు. పేదలు అర్ధికంగా అదుకోవటానికి అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని, కాపులకు, బ్రాహ్మణలను అదుకోవటానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజధానిని దేశంలోనే అగ్రగామిగా నిలబడుతున్నట్లు చెప్పారు. పేదలకు వైద్యసేవలను విసృతం చేసామని, కొత్తవ్యాధులను పథకంలో తీసుకువచ్చామని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద సంపద భారతదేశానికి యువత ఉందని వారికి వృత్తి,నైపుణ్యాలను, ఉన్నతవిద్యావంతులను చేస్తే ప్రపంచాన్ని జయిస్తామన్నారు. రెండే కులాలు ఉన్నాయని ఒకటి డబ్బులు ఉన్నవారు,అది లేని వారని ,డబ్బులు లేకపోతే పిల్లలు కూడా పట్టించుకొని పరిస్థితి నెలకొంటుందన్నారు. ప్రజలను అర్ధికంగా ఎదుగేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని మిగిలిన వాయిదాను త్వరలోనే వడ్డీతో సహ అందజేస్తామని తెలిపారు. స్మార్ట్‌ విలేజ్‌, స్మార్ట్‌వార్డుల ప్రవేటు, ప్రభుత్వ భాగస్వామంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కొత్త నాటకాలతో అవినీతి పరులు ప్రజలను కులాలు,మతాల పేరుతో విద్యాంసాలకు పాల్పడుతున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అబివృద్ధిని అడ్డుకుంటారని వారిని ప్రజలు సహించరన్నారు. ఎన్‌టీఅర్‌ రామరాజ్యం కోసం ప్రతి ఒక్కరు చైతన్యంతో కలిసి రావాలని సీఎం కోరారు. రాష్ట్రప్రగతి కోసం రాజీపడమని, బుల్లెట్‌లా దూసుకుపోతామని తెలిపారు.

No comments:

Post a Comment