- చివరి ఇన్నింగ్స్ ఆడేసిన మెకల్లమ్
- కష్టాల్లో కివీస్
- పట్టు బిగించిన ఆసీస్
న్యూజిలాండ్ విధ్వంసక బ్యాట్స్‌మన బ్రెండన మెకల్లమ్ టెస్ట్ కెరీర్ ముగిసింది. ఆస్ర్టేలియాతో రెండో టెస్ట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీతో కదం తొక్కిన బ్రెండన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయాడు. తన చివరి ఇన్నింగ్స్‌లో 25 పరుగులే చేసి.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక మెకల్లమ్‌కు ఘనమైన వీడ్కోలు దక్కేలా కనిపించడం లేదు. ఆతిథ్య జట్టు వైట్‌వాష్ ముప్పు ఎదుర్కొంటోంది. మ్యాచపై కంగారూలు ఇప్పటికే పట్టు బిగించారు. ఓవర్‌నైట్ స్కోరు 363/4తో సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ మరో 142 రన్స్ జోడించి 505 పరుగులకు ఆలౌటైంది. దీంతో స్మితసేనకు 135 పరుగుల తొలి ఇన్నింగ్ ఆధిక్యం లభించింది.
వాగ్నర్ 6 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ జట్టులో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (0) డకౌట్ కాగా.. నికోలస్ (2) సింగిల్ డిజిట్‌కే పెవిలియన చేరాడు. టామ్ లాథమ్ (39), మెకల్లమ్ కూడా శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో మూడోరోజు ఆటచివరకు కివీస్ 4 వికెట్లకు 121 పరుగులు చేసింది. మెకల్లమ్ సేన ఇంకా 14 రన్స్ వెనకబడి ఉంది. ఆసీస్ బౌలర్లు చెలరేగితే నాలుగో రోజే మ్యా చ ముగిసే అవకాశం ఉంది.
Tuesday, 23 February 2016
బై...బై.. బ్రెండన్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment