పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 23 February 2016

ధోనీకి గాయం.. బ్యాక్‌ప్‌గా పార్థివ్‌


ఆసియా కప్‌ ఆరంభానికి మరొక్క రోజే సమయం ఉన్న నేపథ్యంలో భారతకు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ధోనీ సోమవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతనికి బ్యాక్‌పగా హుటాహుటిన పార్థివ్‌ పటేల్‌ను బంగ్లాదేశ్‌ పంపాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌లో భారత టైటిల్‌ వేటను ప్రారంభించనుంది. ‘ఢాకాలో సోమవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో ధోనీ వీపు నొప్పితో ఇబ్బంది పడ్డాడు.
 
దీంతో అతనికి బ్యాక్‌పగా పార్థివ్‌ పటేల్‌ను బంగ్లాదేశ్‌ పంపాలని సెలెక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్థివ్‌ వీలైనంత త్వరగా జట్టుతో చేరనున్నాడ’ని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. కాగా.. సోమవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో యువ పేసర్‌ జస్‌ప్రీత బుమ్రా కూడా పాల్గొనలేదు. దీంతో అతని ఫిట్‌నెస్‌పైనా అనుమానాలు చెలరేగాయి. అయితే.. వాతావరణ మార్పుల వల్ల బుమ్రా నలతగా కనిపించాడని.. కాబట్టి అతనికి ఒక రోజు విశ్రాంతి కల్పించారని తెలిసింది. కాగా.. దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న పార్థివ్‌ చివరిసారిగా 2012లో భారతకు ప్రాతినిథ్యం వహించాడు.

No comments:

Post a Comment