- హంపి, హారిక గేమ్‌లు డ్రా
ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నీలో భారత్ టైటిల్ ఆశలు ఆశలు ఆవిరయ్యా యి. టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన తరుణంలో సోమవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్న భారత్ గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక రేసు నుంచి వైదొలిగారు. బాట్సియాష్విలి నినో (జార్జియా)తో గేమ్‌ను హంపి డ్రాగా ముగించింది. హారిక, పియా క్రామ్లింగ్ (స్వీడన్) మధ్య జరిగిన గేమ్ కూడా ఫలితం తేలకుండానే ముగిసింది. కాగా, పది రౌండ్లు ముగిసే సరికి హంపి 5, హారిక 4 పాయింట్లతో ఉన్నారు. మరొక్క రౌండ్ మిగిలున్న పోటీలో జు వెన్‌జున్, సారాసదత ఏడేసి పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
No comments:
Post a Comment