టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన బ్రెండన్ మెకల్లమ్ రికార్డును భారత ఆటగాళ్లే అధిగమించాలని కోరుకుంటున్నట్టు టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ‘మెకల్లమ్ ప్రపంచ రికార్డు సాధించడం పట్ల ఆనందంగా ఉన్నా. దీన్ని భారత క్రికెటర్లే అధిగమించాలని ఆశిస్తున్నా. గుజరాత లయన్స్ జట్టులో మెకల్లమ్ ఉండడం సంతోషకరం. అత ను భయమెరుగని క్రికెటర్. అలాంటి వారినే మేం కోరుకుంటున్నామ’ని శనివారం జరిగిన ఐపీఎల్ కొత్త జట్టు గుజరాత లయన్స్ జెర్సీ ఆవిష్కరణ సభలో రైనా పేర్కొన్నాడు. గుజరాత కెప్టెన్సీ తనకు పదవి మాత్రమేనని, జట్టును గెలిపించే ప్రదర్శనలే ముఖ్యమని చెప్పాడు.
No comments:
Post a Comment