పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 21 February 2016

ఆసియా బ్యాడ్మింటన్‌‌లో భారత్‌కు కాంస్యం

  • సెమీస్‌లో ఇండోనేసియా చేతిలో ఓటమి

ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంపై ఆశలు రేకెత్తించిన భారత పురుషుల జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 1-3తో ఇండోనేసియా చేతిలో పరాజయం పాలైంది. కిడాంబి శ్రీకాంత గెలిచినా.. మిగతా షట్లర్లు నిరాశ పరచడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా, మరో సెమీ్‌సలో జపాన 3-0తో కొరియాపై గెలిచి ఫైనల్‌కు చేరింది. సెమీస్‌కు చేరినందున భారత కాంస్యం నెగ్గింది. గత మూడు దశాబ్దాల కాలంలో ఈ టోర్నీ పురుషుల విభాగంలో భారత కనీసం కాంస్యం నెగ్గడం ఇదే తొలిసారి.
 
శ్రీకాంత్ పోరాడినా: తొలి సింగిల్స్‌లో శ్రీకాంత్ 21-14, 23-25, 21-9తో టామీ సుగియార్టోపై గెలవడంతో.. భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే తొలి డబుల్స్‌లో మను అత్రి-సుమిత్ రెడ్డి జోడీ 11-21, 10-21తోఅషాన్-సెతివాన్ ద్వయం చేతిలో ఓడింది. తర్వాత రెండో సింగిల్స్‌లో భారీ అంచనాలున్న అజయ్‌ జయరామ్‌ 15-21, 20-22తో ఆంటోనీ చేతిలో పరాజయం పాల య్యాడు. ఇక కీలక రెండో డబుల్స్‌లో ప్రణవ్‌ చోప్రా-అక్షయ్‌ దేవాల్కర్‌ జోడీ 13-21, 21-18, 15-21తో ప్రతమ-కరంద ద్వయం చేతిలో ఓడడంతో.. భారత కథ ముగిసింది. ప్రణయ్‌కి రెండో సింగిల్స్‌ ఆడే అవకాశం కూడా రాలేదు. ఇక ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో జపాన-ఇండోనేసియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

No comments:

Post a Comment