పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 21 February 2016

పుణెరి, జైపూర్‌ విజయాలు


 ప్రొ కబడ్డీ లీగ్‌ మూడో అంచె పోటీల్లో పుణెరి పల్టన్‌, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్లు విజయాలు సాధించాయి. శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పుణెరి 32-22తో దబాంగ్‌ ఢిల్లీపై గెలిచింది. దీపక్‌ నివాస్‌ (6), జస్మీర్‌ సింగ్‌ (6), కెప్టెన్‌ మన్‌జిత చిల్లార్‌ (5) రాణించారు. సందీప్‌ (6), కెప్టెన్‌ రవీందర్‌ (4) పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. స్టార్‌ రైడర్‌ కాశిలింగ్‌ 3 రైడ్‌ పాయింట్లు మాత్రమే తేవడం జట్టుపై ప్రభావం చూపింది. దబాంగ్‌ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఇది ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో జైపూర్‌ 30-21తో బెంగళూరు బుల్స్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇక పాయింట్ల పట్టికలో పాట్నా పైరేట్స్‌ (47), బెంగాల్‌ వారియర్స్‌ (32), యు ముంబా (30), పుణెరి (27) టాప్‌-4లో కొనసాగుతున్నాయి.

No comments:

Post a Comment