పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 21 February 2016

చివరి బంతికి సఫారీలు విన్

  • తొలి టీ-20లో ఇంగ్లండ్‌ ఓటమి
  • స్వదేశంలో ఇంగ్లండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా బోణీ చేసింది. శుక్రవారం రాత్రి జరిగిన డే/నైట్‌ మ్యాచలో సఫారీలు 3 వికెట్లతో ఇంగ్లండ్‌పై గెలిచి.. సిరీ్‌సలో 1-0 ఆధిక్యం సాధించారు. ఇమ్రాన తాహిర్‌ (4/21), అబాట్‌ (2/31) విజృంభణతో.. పర్యాటక ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (32 నాటౌట్‌), అలెక్స్‌ హేల్స్‌ (27) రాణించారు. అనంతరం సఫారీలు 7 వికెట్లు కోల్పో యి చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించారు. కెప్టెన డుప్లెసిస్‌ (25), జేపీ డుమిని (23), హషీమ్‌ ఆమ్లా (22) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 15 రన్స అవసరం కాగా.. క్రిస్‌ మోరిస్‌ (17 నాటౌట్‌), అబాట్‌ (2 నాటౌట్‌) జట్టుని గెలిపించారు. అబాట్‌ సింగిల్‌ తీయగా.. తర్వాత 3, 4 బంతుల్ని మోరిస్‌ 4, 6 బాదాడు. చివరి రెండు బాల్స్‌కు మరో 4 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు.

No comments:

Post a Comment