పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 21 February 2016

మయూఖకు స్వర్ణం

  • ద్యూతి, సుగంధకు కాంస్యాలు
  • ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌

ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియనషిప్‌లో భారత లాంగ్‌ జంపర్‌ మయూఖ జానీ పసిడి పతకం సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో భారతకు ఇదే తొలి స్వర్ణం. ఫైనల్లో మయూఖ 6.35 మీటర్లు దూకి విజేతగా నిలిచింది. మరో భారత క్రీడాకారిణి ప్రజూషా (6.15 మీ) ఐదో స్థానానికి పరిమితమైంది. ఇక మహిళల 60 మీటర్ల డాష్‌ రేస్‌లో స్టార్‌ స్ర్పింటర్‌ ద్యూతీ చంద్‌ కాంస్యం దక్కించుకుంది. ఫైనల్‌ రేస్‌ను ద్యూతి 7.37 సెకన్ల టైమింగ్‌తో ముగించి మూడో స్థానంలో నిలిచింది. హీట్స్‌లో ఆమె (7.28) జాతీయ రికార్డు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా, మహిళల 1500 మీటర్ల పరుగులో సుగంధ కుమారి (4:29:06) కాంస్య పతకం నెగ్గింది. మహిళల పెనాథ్లానలో స్వప్న బర్మన 3,285 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

No comments:

Post a Comment