పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 23 February 2016

భారత్ నుంచి ఉద్యోగాలు వెనక్కు తెస్తా: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న వివాదాస్పదన నేత డొనాల్డ్‌ ట్రంప్‌ భారత వ్యతిరేక వైఖరిని వెళ్లగక్కారు. భారత ప్రగతిని ప్రపంచం గుర్తించడంలేదని గతనెలలో వ్యాఖ్యానించిన ఆయన, దక్షిణ కరోలినా ప్రైమరీలో ఆదివారం విజయం సాధించిన నేపథ్యంలో తాజా విమర్శ చేశారు
ఈ మేరకు అమెరికా నుంచి భారత, చైనా, మెక్సికో, జపాన్‌, వియత్నాం వంటి దేశాలు ఉద్యోగాలను తన్నుకుపోతున్నాయని ఆరోపించారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆ దేశాలన్నిటినుంచి అమెరికన్ల ఉద్యోగాలను వెనక్కు తెస్తానన్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్‌-అమెరికన్లలో 58 శాతం యువత నిరుద్యోగులుగా ఉన్నారని వారికోసం చేయాల్సిందెంతో ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో వారికి తనపై విశ్వాసం ఉందని, అందుకే తనకు మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తంచేశారు. ఇక అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిని తానేనని, డెమోక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్‌ తన ప్రతర్థిగా ఉంటారని జోస్యం చెప్పారు. తద్వారా అమెరికా చరిత్రలో అత్యధిక పోలింగ్‌ శాతం నమోదవుతుందని, అధ్యక్షుడినయ్యేది తానేనని కూడా వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment