- తొలి టీ-20లో లంక చిత్తు
- సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యం సొంతగడ్డపై శ్రీలంక మహిళల క్రికెట్ జట్టుతో మూడు మ్యాచల టీ-20 సిరీస్‌లోనూ మిథాలీ సేన బోణీ చేసింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్ లో ఆతిథ్య భారత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 34 పరుగుల తేడాతో లంకపై గెలిచి.. సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. హర్మనప్రీత్ కౌర్ (36), స్మృతి మంధాన్ (35) రాణించడంతో.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన మిథాలీ (3), వనిత (12) విఫలమైనా.. స్మృతి-కౌర్ మూడో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. అనుజా పాటిల్ (22 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. అనంతరం లక్ష్య ఛేదనలో లంక ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్పిన్నర్లు అనుజా పాటిల్ (3/14), దీప్తి శర్మ (2/23) లంకను కట్టడి చేశారు. అనుజా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఇక ఇరు జట్ల మధ్య బుధవారం రెండో టీ20 జరగనుంది.
Tuesday, 23 February 2016
మిథాలీ సేన బోణీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment