విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో రోజువారీ సేకరించే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. విశాఖ జిల్లా అనందపురం మండలం గిడిజాలలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు జిందాల్ గ్రూప్‌కు చెం దిన జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (విశాఖ) ముందుకొచ్చింది. రూ.150 కోట్ల పెట్టుబడితో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించనున్నారు. దీనికి అవసరమైన 20 ఎకరాలను కంపెనీకి లీజు ప్రాతిపదికన ఇవ్వనున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు సంబంఽధించి షరతులతో కూడిన ఒప్పందంపై బుధవారం జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, కంపెనీ ప్రతినిధి సంతకాలు చేశారు. గత నెల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జీవీఎంసీ, జిందాల్ గ్రూప్ ప్రాథమికంగా ఒప్పం దం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం నగరపాలక సంస్థలో ప్రతిరోజు వెయ్యి టన్నుల చెత్త సేకరిస్తున్నారు. ఆ చెత్తను కాపులుప్పాడలో డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. కాగా, ఒప్పందం మేరకు గిడిజాలలో ప్లాంట్‌కు ప్రతిరోజు 950 టన్నుల చె త్తను జీవీఎంసీ సరఫరా చేయాలి. దీనివల్ల కాలులుప్పాడ డంపింగ్ యార్డుపై ఒత్తిడి తగ్గనున్నది. విద్యుత్ ప్లాంట్ ఏడాదిన్నరలో పూర్తవుతుందని జీ వీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
Thursday, 18 February 2016
చెత్త నుంచి విద్యుత్ తయారీ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment