పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Thursday, 18 February 2016

సీఐడీ కస్టడీకి అగ్రి గోల్డ్‌ చైర్మన్, ఎండీ



అగ్రి గోల్డ్‌ సంస్థ చైర్మన్‌ అవ్వా వెంకట రామారావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అవ్వా వెంకట శేషునారాయణరావు అలియాస్‌ కుమార్‌లను సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. అధిక వడ్డీలు ఇస్తామని ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు వసూలు చేసి మోసగించిన కేసులో అరెస్టు చేసిన వీరిని బుధవారం పోలీసులు ఏలూరు స్పెషల్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరి రిమాండ్‌ను పొడిగించింది. నిందితులు బెయిల్‌ కోసం చేసుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో నిందితులను పది రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే వారం రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వీరిని భారీ బందోబస్తు మధ్య జిల్లా జైలు నుంచి ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌ ఏపీసీఐడీ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు.

No comments:

Post a Comment