చేనేత, మరమగ్గాల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రుణమాఫీ చేసింది. ఫలితంగా 13 జిల్లాల్లోని 24 వేల మందికి అప్పుల బాధ తీరనుంది. ఆంధ్రప్రదేశలోని సహకార, వాణిజ్య, పట్టణ సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న చేనేత, మర మగ్గాల కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం రూ.110.96 కోట్లు విడుదల చేస్తూ చేనేత శాఖ కార్యదర్శి నరేశ పెనుమాక బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఆమోదించిన జాబితాను వారం రోజుల్లోగా పరిశీలించాలని బ్యాంకర్లను ప్రభుత్వం కోరింది. కోటయ్య కమిటీ సిఫారసుల మేరకు 2014 మార్చి 31 నాటికి అప్పులున్న చేనేత కార్మికుల వ్యక్తిగత లోన్లు రూ.లక్ష, సొసైటీ ద్వారా తీసుకున్న గ్రూపు లోన్లు రూ.5 లక్షల వరకూ మాఫీ చేసింది. ఎన్ని బ్యాంకుల్లో లోను తీసుకున్నా ఆ మొత్తాన్ని లెక్కించి వ్యక్తికి రూ.లక్ష, గ్రూప్‌నకు రూ.5 లక్షలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది.
Thursday, 18 February 2016
చేనేతలకు రుణవిముక్తి

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment