విలీన మండలాల పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లా పరిధిలోని ఆరు మండలాలు ఉభయగోదావరి జిల్లాల్లో విలీనమయ్యాయి. ఈ మండలాల్లోని పాఠశాలల్లో 309 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన నాలుగు మండలాల (భద్రాచలం రెవిన్యూ మండలం, కూనవరం, చింతూరు, వి.ఆర్.పురం) పాఠశాలలకు సంబంధించి 285 టీచర్ పోస్టులు, పశ్చిమగోదావరి జిల్లాలోని రెండుమండలాల (వేలేర్పాడు, కుక్కునూరు) పాఠశాలలకు సంబంధించిన 24 టీచర్ పోస్టులను ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Thursday, 18 February 2016
విలీన మండలాల్లో 309 టీచర్ పోస్టుల భర్తీ
విలీన మండలాల పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లా పరిధిలోని ఆరు మండలాలు ఉభయగోదావరి జిల్లాల్లో విలీనమయ్యాయి. ఈ మండలాల్లోని పాఠశాలల్లో 309 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన నాలుగు మండలాల (భద్రాచలం రెవిన్యూ మండలం, కూనవరం, చింతూరు, వి.ఆర్.పురం) పాఠశాలలకు సంబంధించి 285 టీచర్ పోస్టులు, పశ్చిమగోదావరి జిల్లాలోని రెండుమండలాల (వేలేర్పాడు, కుక్కునూరు) పాఠశాలలకు సంబంధించిన 24 టీచర్ పోస్టులను ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment