ప్రకృతి పగబూనటంతో రైతులు కరువు కోరల్లో చిక్కుకు న్నారు. ప్రధానంగా నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు పరిధిలో అన్నదా తలు ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్నారు.
కృష్ణా జలాలు లేక పోవటం, చినుకు రాలక పంటల సాగు నిలిచిపోయింది. రైతులు, రైతు కూలీలకు ఉ పాధి కరువైంది. అప్పులతో కుటుంబాలను వెళ్ళదీస్తున్నారు. ఒకవైపు కరువు సాయం అందకపోగా మరో వైపు రుణమాఫీ రెండో వాయిదా సొమ్ము చెల్లించకపోవటం తో ఆర్థిక కష్టాలు రోజురోజుకు రైతుల కుటుంబాల్లో పెరుగుతున్నాయి. సంక్రాం తి కల్లా రైతుల బ్యాంక్ ఖాతాలలో రుణమాఫీ రెండో వాయిదా సొమ్మును జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పటంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. చేతిలో రూపాయి లేక పం టల సాగు కాక తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొం టున్నారు.

సాగర్ కుడి కాలువ పరిధిలో 3.16 లక్షల ఎకరాలలో వరి సాగు లేక పొలా లు బీళ్ళుగా మారాయి. ప్రత్యామ్నాయ పంటల సాగుకు వర్షాలు లేవు. దీంతో రైతులు పనులు లేక ఖాళీగా ఉండాల్సిన దయనీయస్థితి నెలకుం ది. వర్షాభావం తో దిగుబడులు దారుణంగా తగ్గాయి. పంటలు సాగు చేసిన రైతులు కూ డా నష్టాలను చవి చూడాల్సిన వచ్చింది. ఆయకట్టు ప్రాంతాన్ని ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించింది. దీనిపై కూడా ఆర్థిక సా యం అందించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని అన్న దాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సీఆర్‌డీఏ పరిధి మినహా 6,72,241 మంది రైతులకు రుణ మాఫీ ప్రభుత్వం ప్రకటించింది. రూ.7,453 కోట్లు రుణమాఫీ కింద రైతు లకు చెల్లించాలి. ఐదు వాయిదాల్లో రుణమాఫీ నగదు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించి న విషయం తెలిసిందే. తొలి విడత రైతు బ్యాంక్ ఖాతాలకు ఒక్కొ క్కరికి రూ.30 వేలు చొప్పున 2014 డిసెంబర్‌లో జమ చేసింది. మలి విడత రూ. 30 వేలను సంక్రాంతి కల్లా రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామని ప్రకటిం చిన ప్రభుత్వం అమలు చేయటంలో విఫలమైంది. తొలి విడత వాయిదా సొమ్మును బ్యాంకులు వడ్డీ కింద జమ వేసుకున్నాయి. కరువు పరిస్థితుల్లో రెం డో విడత రుణ మాఫీ వాయిదా సొమ్ము విడుదల చేస్తే కొంతైనా ఆర్థిక ఇబ్బం దులను అధిగమించవచ్చని రైతులు ఆశ పడుతున్నారు. బ్యాంకుల్లో అప్పులు అలానే పేరుకుపోయాయి. తొలి వాయిదా సొమ్ము వడ్డీలకు సరి పోగా పూర్తి అప్పులో రూపాయి కూడా అధిక శాతం మంది రైతులు జమ వేయలేని దుస్థితి నెలకొంది. అటు బ్యాంకుల్లో అప్పులు తీరక పోగా ఇటు రెండో విడత వా యిదా సొమ్ము అందకపోవటంతో రైతుల ఆర్థిక ఇబ్బందులు చెప్పనల వి కావు. చిలకలూరి పేటకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారు. ఈ క్రమంలో ఆర్థిక వెతలు.. రుణమాఫీ నగదు విడుదల.. కరువు సాయం.. తదితర అంశాలకు సంబంఽధించి ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని ఈ ప్రాంత అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండో వాయిదా రుణమాఫీ సొమ్ము విడుదలపై స్పష్ట మైన తేదీని ప్రకటిస్తారని బాధితులు ఆశిస్తున్నారు.
No comments:
Post a Comment