పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 23 February 2016

రాజధాని రాకతో మంగళగిరి కిటకిట

పట్టణ జనాభా 2021 నాటికి 2.20 లక్షలకు చేరే అవకాశం ఉందని సీఆర్‌డీఏ మాస్టర్‌ప్లానులో అంచనా వేశారు. ప్రస్తుతం పట్టణ జనాభా లక్షలోపే ఉంది. వచ్చే ఆరేళ్లలో మాత్రం పట్టణ జనాభా సంఖ్య చాలా వేగంగా అపరిమితంగా పెరుగుతుందని సీఆర్‌డీఏ భావిస్తుంది
రాజధాని అమరావతికి మంగళగిరి అతి సమీపంగా ఉండడం...నాలుగు ముఖ్య ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉండడంతోపాటు వస్తు రవాణా కేంద్రంగా మంగళగిరికి అన్నీ అనుకూలతలు ఉన్న దృష్ట్యా మంగళగిరిలో ఆవాసానికి ప్రజలు పెద్దఎత్తున ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ కారణాల దృష్ట్యా రాబోయే రోజుల్లో మంగళగిరి పట్టణ జనాభా సంఖ్య జెట్‌స్పీడు వేగంతో పెరగడం ఖాయమని సీఆర్‌డీఏ అంచనా వేసింది. సీఆర్‌డీఏ ఊహిస్తున్నట్టుగా మంగళగిరి జనాభా అత్యంత వేగంగా పెరిగినట్టయితే పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో సీఆర్‌డీఏ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పురపాలక సంఘానికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను అంచనా వేయడంతోనే ఆత్మకూరు, చినకాకాని గ్రామాలను పురపాలకసంఘంలో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో పట్టణ విస్తీర్ణం గణనీయంగా పెరుగనుంది. దరిమిలా మరిన్ని టౌన్‌షి్‌పల ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతోంది. పట్టణ తాగునీటి పధకం సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల్సి ఉంది. ముఖ్యంగా నూతన రహదార్ల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న రహదారులను భారీగా విస్తరించాల్సి ఉంది. స్వల్పకాల వ్యవధిలో అతిభారీగా పెరుగనున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు పురపాలకసంఘం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా సమాయాత్తం కావాల్సిన అవశ్యకత స్పష్టంగా కనిపిస్తోంది.

No comments:

Post a Comment