పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 23 February 2016

బలమైన నాయకుడు...భూమా నాగిరెడ్డి


నంద్యాల లోక్‌సభ రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలోనూ చక్రం తిప్పిన ముఖ్య నాయకుడు భూమా నాగిరెడ్డి. ఆళ ్లగడ్డకు చెందిన భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఎంపీగా వరుసగా మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించారు. ముక్కుసూటిగా వ్యవహరించే భూమా నాగిరెడ్డి.. అదే దూకుడుతో రాజకీయాల్లోనూ వర్గ సమీకరణలు చేయడంలో దిట్ట. టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీగా భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఏపీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌గా వ్యవహరించారు. భూమా ముఖ్య అనుచరు డు ఏవీ సుబ్బారెడ్డి ఏపీఆర్‌ఐసీ చైర్మన్‌గా క్యాబినేట్‌ హోదాలో పని చే శారు. అయితే రాజకీయ వర్గ సమీకరణలతో భూమా కుటుంబం టీడీ పీ నుంచి ప్రజారాజ్యం, అక్కడి నుంచి వైసీపీలోకి చేరి చక్రం తిప్పింది. ప్రస్తుతం వైసీపీలో ఇమడలేక భూమా తిరిగి సొంత గూడు టీడీపీలోకి వచ్చారు. 
వైద్య విద్యను మధ్యలో ఆపేసి.. 
హోమియో వైద్య విద్యను మధ్యలో వదిలిపెట్టి 1987లో రుద్రవరం మండలం నర్సాపురం సింగిల్‌ విండో అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం 1988లో ఆళ్లగడ్డ మండల అధ్యక్షుడిగా విజయం సాధించారు. 1989 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి సోదరుడు భూమా వీర శేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన గంగుల ప్రతాప రె డ్డిపై విజయం సాధించారు. అయితే భూమా వీరశేఖర్‌రెడ్డి అనారో గ్యంతో మరణించడంతో 1992లో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి తొలి సారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1994 సాధారణ ఎన్నికల్లో కూడా భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 
పీవీపై పోటీ.. 
ప్రధాన మంత్రి హోదాలో నంద్యాల ఎంపీగా పోటీ చేసిన పీవీ నర సిం హారావుపై తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డిని నిలబె ట్టింది. 1991లో ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో పీవీ నరసింహారావుకు ఏకపక్షంగా జరిగిన పోలింగ్‌తో 5,80,035 ఓట్లతో విజయం సాధించారు. అయితే 1996 లో జరిగిన ఎన్నికల్లో మరోసారి పీవీ నరసింహారావుపై పోటీ చేసేందుకు స్థానిక నేతలు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉ న్న భూమా నాగిరెడ్డి టీడీపీ అధినాయకత్వం ఆదేశాల మేరకు పోటీ చేశా రు. ఆ ఎన్నికల్లో పీవీ కేవలం 98,530 మెజార్టీతో విజయం సాధించారు. 
హ్యాట్రిక్‌ ఎంపీగా రికార్డు 
1996లో రెండోసారి నంద్యాల ఎంపీగా పోటీ చేసి గెలిచిన ప్రధాని పీవీ నరసింహారావు ఒడిశాలోని బరంపురం నుంచి కూడా గెలుపొందారు. నం ద్యాలకు పీవీ రాజీనామా చేయడంతో 1996లోనే ఉప ఎన్నికలు జరిగాయి. టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసిన భూమా నాగిరెడ్డికి ప్రత్యర్థిగా అప్పటి కేంద్ర మంత్రి, స్థానికేతరుడైన పీవీ రంగయ్యనా యుడును కాంగ్రెస్‌ పార్టీ బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో 4,40,142 భారీ మెజార్టీతో భూమా నాగిరెడ్డి విజయం సాధించి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో జరి గిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గంగుల ప్రతా పరెడ్డి పై స్వల్ప మెజార్టీ 4,650తో రెండోసారి విజయం సాధించారు. 1999లో లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో మూడోసారి భూమా నాగిరెడ్డి మరోసారి కాంగ్రెస్‌ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై 72,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
పీఆర్పీలో చేరి.. వైసీపీలో కీలక నేతగా.. 
2004లో జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ శాస నసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓట మి పాలయ్యారు. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలోకి చేరారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పీఆ ర్పీ అభ్యర్థిగా నంద్యాల ఎంపీ స్థానం నుం చి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్‌ హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో మరణించడం, జగన్‌ స్థాపించిన వైసీపీలోకి భూమా చేర డం చకచకా జరిగిపోయాయి. 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి భూమా నాగిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇదే ఎన్నికల్లో శోభానాగిరెడ్డి మరణానంతరం జరిగిన పోలింగ్‌లో గెలిచా రు. తదనంతరం ఎన్నికల సంఘం ఆదేశా ల మేరకు తిరిగి ఉప ఎన్నిక నిర్వహించా రు. ఈ ఎన్నికలో భూమా కుమార్తె అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

No comments:

Post a Comment