- ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కూడా..
- కండువాలు కప్పి ఆహ్వానించిన చంద్రబాబు
- భూమాకు క్యాబినెట్ హోదా హామీ!
- జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణలు
- సిద్ధమవుతున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు
జిల్లాకు మరో మంత్రి పదవి రాబోతుందా? జిల్లాలో టీడీపీ తిరుగులేని బలం సాధించబోతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. జిల్లా రాజకీయాలు ఉన్న ఫళంగా వేడెక్కాయి. సీఎం చంద్రబాబు తా జాగా టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే భూ మా నాగిరెడ్డికి చంద్రబాబు గట్టి హామీ ఇచ్చినట్టు తెలిసింది. జిల్లాలో వైసీపీ మూల స్తంభమైన భూమా నాగిరెడ్డి ఉన్నట్టుండి టీడీపీలో చేరారు. క్యాబినెట్ హోదా కలిగిన విద్యుత్‌శాఖ మంత్రి పదవిని భూమా డిమాండ్ చేసినట్టు తెలిసింది. కానీ మంత్రి పదవి కేటాయించడం ఖాయమే అయినా ఏ శాఖ ఇస్తారో చంద్రబాబు ఇంకా స్పష్టం చే యనట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రం లో టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాకు సీఎం చంద్రబాబు సముచిత స్థానమే కల్పించారు. 14 నియోజకవర్గాల్లో మూడు స్థానాలే సాధించినా పత్తికొండ నుంచి గెలుపొందిన రాజకీయ కురువృద్ధుడు కేఈ కృష్ణమూర్తికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఎన్నికల అనంతరం జిల్లాలో టీడీపీని బలోపేతం చేయాలని అధినేత భావించారు. ఇదే కోవలోనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని శిల్పా చక్రపాణిరెడ్డికి ఇవ్వడంతోపాటు ఎమ్మెల్సీ సీటును కేటాయించారు. ఈ పరిణామంతో జిల్లాలో టీడీపీ కాస్త బలం పెంచుకుంది.
భూమా చేరికతో పెరిగిన టీడీపీ బలం..
నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డితోపాటు ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సోమవారం రాత్రి టీడీపీలో చేరారు. ఈ పరిణామంతో జిల్లాలో టీడీపీ బలం ఐదుకు చేరింది. భూమాకు మంత్రి పదవి ఇచ్చే డిమాండ్‌తో ఆయన టీడీపీలో చేరగా ఆయనతోపాటు రెండుమూడు రోజు ల్లో మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశాలున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే జిల్లాలో టీడీపీ బలం అనూహ్యంగా పెగే అవకాశాలున్నాయి.
బాబు కోర్టులో కర్నూలు రాజకీయం..కర్నూలు రాజకీయం సీఎం చంద్రబాబు కోర్టుకు చేరింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి జిల్లాలో పార్టీని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ మేరకు కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఒక ఎమ్మెల్యేతోసహా ఐదుగురిని ముందుగా టీడీపీలో చేర్పించే ప్రయత్నాలు చేశారు. జనవరి 6నే ముహూర్తం ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అనంతరం జగన్ టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్ట గల బలం తాను సంపాదించబోతున్నాననే ప్రకటన అధికార పార్టీకి సవాల్‌గా మారింది. ముందుగా కర్నూలుపైనే దృష్టి సారించిన చంద్రబాబు.. వైసీపీకి జిల్లా లో కీలకమైన భూమానాగిరెడ్డిపై దృష్టి సా రించారు. ఆయన డిమాండ్ మేరకు క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి పదవి ఇచ్చేం దుకు అంగీకరించినట్టు సమాచారం. భూమా మంత్రి పదవి చేపట్టిన తరువాత జిల్లాలో టీడీపీ బలాన్ని 11దాకా తీసుకేళ్లేందుకు ప్రణాళిక రచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏడాదిలోగా రాయలసీమ రాష్ట్రం సాధిస్తాం బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిపగిడ్యాల: ప్రత్యేక రాయలసీమ రాషా్ట్రన్ని ఏడాదిలోగా సాధిస్తామని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పగిడ్యాల మండలంలోని బైరెడ్డి స్వగ్రామమైన ముచ్చుమర్రిలో ఆయన సోమవారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ సీమ జిల్లాల్లో అభివృద్ధిని విస్మరించారన్నారు. రాయలసీమ రాష్ట్రం కోసం తాము చేస్తున్న యాత్రలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి దయ్యం పట్టిందన్నారు. కోస్తా ప్రాంతానికి చెందిన వారితో రాయలసీమవాసులు కలిసి జీవించలేరన్నారు. ఎర్రచందనం ద్వారా వచ్చే కోట్ల ఆదాయాన్ని అమరావతికి తరలించుకు పోతున్నారని ఆరోపించారు. రాయలసీమలో కరువు కాటకాలు సంభవించడంతో తాగేందుకు చుక్క నీరైనా లేక ప్రజలు ఇబ్బందు లు పడుతున్నా పట్టించుకునేవారు లేరన్నారు. గ్రామాల్లో ని ప్రజలు వలసలు వెళ్లకుండా నివారించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని అన్నారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే స్వీడన్, నార్వే, నెదర్లలాండ్ దేశాల కంటే అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాసనాయుడు ఉన్నారు.అభివృద్ధి కోసమే..: భూమా నాగిరెడ్డినంద్యాల: చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమన్న ఉద్దేశంతో తాము టీడీపీలో చేరినట్టు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. విజ యవాడలో సోమవారం రాత్రి టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగలేదని, గత పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఈ నేప థ్యంలో కార్యకర్తలతో సమావేశమై టీడీపీలో చేరాలన్న నిర్ణయం తీసుకు న్నామన్నారు. బాబు వల్లే రెండు నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుం దని ప్రజలు, తమ కార్యకర్తలు భావిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వా త ఏపీ పరిస్థితి దారుణంగా ఉందని, ప్రస్తుతం చంద్రబాబు వల్లే రాష్ట్రం అభివృద్ధి బాట నడుస్తుందని అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గి టీడీపీలో చేరలేదని స్పష్టం చేశారు. వైసీపీ నుంచి ఇంకా ఎంతమంది వస్తారో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. తమ చేరిక వల్ల టీడీపీ బలపడుతుందన్నారు.
కార్యకర్తల అభీష్టం మేరకే..: అఖిలప్రియ
నియోజకవర్గ కార్యకర్తల అభీష్టం మేరకు తాము టీడీపీలో చేరినట్టు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. టీడీపీతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు.
Tuesday, 23 February 2016
సైకిలెక్కిన భూమా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment