- ముగ్గురి మృతి..
- భద్రత దళాలపై జాట్ ఆందోళనకారుల దాడులు.. ఘర్షణలు
- గృహ దహనాలు, ప్రభుత్వ వాహనాలకు నిప్పు..
- రహదారులపై బైఠాయింపు
- బలప్రయోగానికి కేంద్రం ఆదేశాలు హర్యానాలో రిజర్వేషన్ కోరుతూ జాట్‌లు చేపట్టిన ఉద్యమం చల్లారలేదు. సోమవారం మళ్లీ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రత దళాలపైనే ఉద్యమకారులు దాడులకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ముగ్గురు చనిపోయారు. నిరసనకారులు జాతీయ రహదార్లను స్తంభింపజేయడంతో బలప్రయోగంతోనైనా ఆటంకాలు తొలగించాలని సాయుధ బలగాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. 9 రోజుల హింసాత్మక ఉద్యమంలో చనిపోయిన వారి సంఖ్య 19కు చేరుకుంది. చాలా చోట్ల రోడ్డుమార్గాలపై ఆందోళనకారులు బైఠాయించారు. రైళ్ల సర్వీసులు ఇంకా పునరుద్ధరణకు నోచుకోలేదు. ఇంకోవైపు.. జాట్‌ల రిజర్వేషన్‌పై పరిశీలనకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడి నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ సోమవారం భేటీ అయింది. మంగళవారం ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో వెంకయ్య సమావేశమవుతారు. అలాగే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రధాని మోదీని కలిసి హర్యానాలో తాజా పరిస్థితులను నివేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆందోళనలను విరమిస్తున్నట్లు అఖిల భారత జాట్ ఆరక్షణ్ సంరక్షణ సమితి (ఏఐజేఏఎ్‌సఎస్) ప్రకటించింది. సోనీపట్ జిల్లాలో సోమవారం మళ్లీ హింస చెలరేగింది. లడ్సోలీ గ్రామంలో జాతీయ రహదారిపై బైఠాయించిన వారిని ఆర్మీ, కేంద్ర సాయుధ బలగాలు తొలగిస్తుండగా. కొందరు ఆందోళనకారులు వారిపై కర్రలతో దాడికి దిగారు. రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ముగ్గురు పౌరులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. కొందరు భద్రత సిబ్బందికి గాయాలయ్యాయి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ జిల్లాలోని ఐదు గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. హిస్సార్, రోహతక్, కైతల్‌లో కూడా హింస చెలరేగింది. ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు విధించారు. కాగా.. హర్యానా కేబినెట్ అత్యవసరంగా సమావేశమె జాట్ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించి జాట్ల ఆందోళన కారణంగా జమ్ము, చండీగఢ్‌లలో చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.రాజస్థాన్‌కూ పాకిన ఉద్యమంజాట్ ఉద్యమం సోమవారం తూర్పు రాజస్థాన్‌కు కూడా వ్యాపించింది. ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పుబెట్టారు. హైవేలు, రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. కాగా.. జాట్ హింసాత్మక ఉద్యమం కారణంగా ఉత్తర భారతంలో రూ.34 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని, నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయని పీహచ్‌డీ చాంబర్ ఓ ప్రకటనలో పేర్కొంది.జోక్యానికి సుప్రీం నో: హర్యానాలో శాంతిభద్రతల పుపరుద్ధరణకు ఆదేశాలు జారీచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుపీరంకోర్టు సోమవారం తిరస్కరించింది. రాష్ట్రప్రభుత్వం నిష్ర్కియగా ఉందన్న వాదనతో ఏకీభవించడం లేదని, ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని సూచించింది.
Tuesday, 23 February 2016
హర్యానాలో మళ్లీ హింస
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment