పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 23 February 2016

శ్రీశైలం ఘాట్‌రోడ్డులో చిరుత మృతి


శ్రీశైలం ఘాట్‌రోడ్డులో చిరు త మృతి చెందింది. సోమవారం సాయంత్రం 6.40 గంటలకు శ్రీశైలానికి 5కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం ముఖద్వారం వద్ద గుర్తుతెలియని వాహపం ఢీకొని చనిపోయింది. అటుగా వస్తున్న ప్రయాణికులు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో శ్రీశైలం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీస ర్‌ ఉదయ్‌దీప్‌, ఫ్లయింగ్‌స్క్వాడ్‌ రేంజర్‌ శ్రీనివాసరెడ్డి, సెక్షన్‌ ఈఫీసర్‌ నాగన్న, బీట్‌ ఆఫీసర్‌ ఠాగూర్‌ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉదయ్‌దీప్‌ మాట్లాడుతూ మృతిచెందిన చిరుతకు 6నుంచి 8నెలల వయస్సు ఉంటుందని, సున్నిపెంట నుంచి వెళ్లే గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో చిరుత మృతి చెందిందని తెలిపారు. వాహనం చిరుత తలపై వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. వాహనం కోసం శ్రీశైల శిఖరేశ్వరం వద్ద, శ్రీశైలం టోల్‌గేట్‌ వద్ద తనిఖీ చేస్తున్నామని తెలిపారు. స్థానిక పశువైద్యులతో శవపరీక్షలు నిర్వహించి, పంచనామ నిర్వహిస్తామన్నారు.

No comments:

Post a Comment