పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

తారకరత్న ‘ఎవరు’


తారకరత్న, పంచీ బోరా, అనూప్‌ తేజ్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఎవరు’. ముప్పా క్రాంతి చిత్ర పతాకంపై ముప్పా అంకమ్మ చౌదరి నిర్మిస్తున్నారు. రమణ సాళ్వ దర్శకుడు. గురువారం నిర్మాతల మండలి హాలులో జరిగిన కార్యక్రమంలో టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో తారకరత్న జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారనీ, సస్పెన్స్ మేళవింపుతో ఆద్యంతం చిత్రం ఆసక్తికరంగా నడుస్తుందనీ దర్శకుడు రమణ సాళ్వ చెప్పారు.
తారకరత్న మాట్లాడుతూ ‘‘ఇది విభిన్నమైన స్ర్కిప్టు. ఇప్పటి వరకూ ఈ తరహా కథ రాలేదు. హీరో హీరోయిన్ అని కాకుండా ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. అందరి కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుంది’’ అన్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదలకు సిద్ధం చేస్తున్నామనీ నిర్మాత అంకమ్మ చౌదరి తెలిపారు. సీతారామశాస్త్రి గారు రాసిన పాటలోనే సినిమా కథ ఇమిడి ఉంటుందనీ, తారకరత్న అభినయం ప్రధానాకర్షణ అవుతుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు యోగేశ్వరశర్మ, నటుడు రఘు కారుమంచి, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. నాజర్‌, సుమన్, లాస్య, బీరం మస్తానరావు తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, కృష్ణ చిన్ని, సహ నిర్మాత: లింగా శ్రీనివాసరావు, రచన, ఛాయాగ్రహణం, దర్శకత్వం: రమణ సాళ్వ.

No comments:

Post a Comment