పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

‘జనతా గ్యారేజ్’ కోసం మూడు కోట్ల సెట్..!


యంగ్‌టైగర్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘జనతా గ్యారేజ్’ కోసం అంతా సిద్ధం చేస్తున్నారట. ఓ వైపు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ సిద్ధం చేస్తుంటే.. మరోవైపు ఈ చిత్రంలో ఎంతో కీలకమైన గ్యారేజ్‌ కోసం ప్రత్యేకమైన సెట్ వేయించే పనిలోఉన్నారట దర్శకుడు కొరటాల. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ వేసిన సెట్‌కు మూడు కోట్ల వరకూ ఖర్చయిందని తెలుస్తోంది. ఓల్డ్ లుక్‌లో ఉండే గ్యారేజ్ కావడంతో ఇంతలా ఖర్చయిందట. ఇప్పటికే సెట్ నిర్మాణం పూర్తవగా.. ఇప్పుడు ఈ గ్యారేజ్‌లోకి పాత కార్లను చేర్చుతున్నారట. త్వరలోనే ఈ సెట్‌లో షూటింగ్ మొదలు కానుంది. ‘నాన్నకు ప్రేమతో’ కోసం డిఫరెంట్ లుక్ ట్రై చేసిన ఎన్టీఆర్.. ‘జనతా గ్యారేజ్’కి మాత్రం తన ఒరిజినల్ గెటప్‌లోనే కన్పించబోతున్నాడట. మరోవైపు మలయాళ స్టార్ మోహన్ లాల్ పోషిస్తున్న పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉంటుందట. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసస సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది.

No comments:

Post a Comment