పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

‘సర్దార్’ వేడుకలో మెగా సందడి..!


మెగా ఫ్యామిలీ అంతా ఒకే వేదికపై కలసి చాలా రోజులయింది. మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ పాటల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు హాజరవుతారని సమాచారం. గతంలో ‘గబ్బర్‌సింగ్‌’ ఆడియోలో కలిసిన మెగాబ్రదర్స్‌ తర్వాత ఏ సినిమా ఫంక్షన్‌లోనూ కలవలేదు. మొన్నటి వరకూ వీరిమధ్య విభేదాలున్నాయనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ గత కొన్నిరోజులుగా మెగాబ్రదర్స్ అప్పుడప్పుడూ కలుస్తునే ఉన్నారు. రీసెంట్‌గా చిరు రెండుసార్లు సర్దార్ సెట్స్‌కు వెళ్లి సందడి చేశారు. ఇక ఈ ఆడియోలోనూ ముగ్గురు మొనగాళ్లు కనిపిస్తే వీరిపై వచ్చే గాసిప్స్‌కు చెక్ పెట్టినట్లే అంటున్నారు సినీజనం. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం ఆడియో మార్చి 12న హైదరాదాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. ఆడియో ఫంక్షన్‌ను మెగా అంచనాలతో అత్యంత భారీ స్థాయిలో దాదాపు రూ.1.50 కోట్ల ఖర్చుతో వేలాది మంది అభిమానుల మధ్య చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇదిలా ఉంటే...ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్‌తో రెండు పాటలు మినహా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. మిగిలిన ఈ రెండు పాటలను యూరప్‌లో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. మార్చి చివరి 10 రోజుల్లో యూరప్ షెడ్యూల్‌ని ప్లాన్ చేసినట్లు సమాచారం. విదేశాలకు వెళ్ళేలోగా టాకీ పూర్తి చెయ్యడమే కాకుండా ఆడియో వేడుక కూడా జరిపేలా సన్నాహాలు చేస్తున్నారట. యూరప్‌లో చివరి షెడ్యూల్‌ను మార్చి నెలాఖరులోగా పూర్తి చేసి..ఉగాది కానుకగా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై సంయుక్తంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్, రాయ్ లక్ష్మీ ఆడిపాడుతున్నారు.

No comments:

Post a Comment