- టెస్టుల్లో మెకల్లమ్ ఫాస్టెస్ట్ సెంచరీ
- వీడ్కోలు మ్యాచ్‌లో 54 బంతుల్లోనే శతకం
- వివ్ రిచర్డ్స్, మిస్బా రికార్డు బద్దలు
- న్యూజిలాండ్ 370; ఆస్ర్టేలియా 57/1
క్రైస్ట్‌చర్చ్: సొంత అభిమానుల హర్షద్వానా లు... ప్రత్యర్థుల గార్డ్ ఆఫ్ హానర్ మధ్య క్రీజులో అడుగిడిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (79 బంతుల్లో 21 ఫోర్లు, 6 సిక్సర్లతో 145) ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్‌తో ఆఖరి మ్యాచ్‌లో తనకు తానే అద్భుత బహుమతిని ఇచ్చుకున్నాడు. ఆస్ర్టేలియాతో శనివారం మొదలైన రెండో టెస్టులో 54 బంతుల్లోనే శతకం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో తన ఆరాధ్య క్రికెటర్ వెస్టిండీస్ మాజీ ఆటగాడు వివ్ రిచర్డ్స్ 1986లో ఇంగ్లండ్‌పై, 2014లో ఆసీ్‌సపై పాకిస్థాన్ క్రికెటర్ మిస్బావుల్ (56 బంతుల్లో సెంచరీ) నెలకొల్పిన రికార్డును తుడిచేశాడు. టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 370 పరుగులు చేసింది. కోరె ఆండర్సన్ (66 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 72), వాట్లింగ్ (58) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్ మూడు, హాజెల్‌వుడ్, పాటిన్సన్, జాక్సన్ బర్డ్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ శనివారం ఆట ముగిసే సమయానికి డేవిడ్ వార్నర్ (12) వికెట్‌ను కోల్పోయి 57 పరుగులు చేసింది. బర్న్స్ (27), ఖవాజ (18) క్రీజులో ఉన్నారు.
కష్టాల మధ్యలో: పిచ్‌పై పచ్చిక ఉండడంతో టాస్ నెగ్గిన ఆసీస్ కెప్టెన్ స్మిత కివీ్‌సను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆరో ఓవర్లోనే ఓపెనర్ గప్టిల్ (18)ను అవుట్ చేసిన పాటిన్సన్ ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. ఆ తర్వాత లాథమ్ (4), 20వ ఓవర్లో నికోలస్ (7) అవుటవడంతో కివీస్ కష్టాల్లో పడిం ది. ఈ దశలో క్రీజులోకొచ్చిన మెకల్లమ్ తానెదుర్కొన్న రెండో బంతినే బౌండ్రీకి తరలించి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. 23వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 21 రన్స్ రాబట్టి మిచెల్ మార్ష్‌కు చుక్కలు చూపించాడు. పాటిన్సన్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు బౌండ్రీలు బాదాడు. దీంతో 26 ఓవర్లకు 74/3తో కివీస్ లంచ్‌కు వెళ్లింది. అప్పటికి మెకల్లమ్ 18 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు.
సిక్సర్లలోనూ రికార్డు!
ఈ ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన బ్రెండన్ టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు (106) సాధించిన బ్యాట్స్‌మన్‌గా మరో ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతను వంద సిక్సర్లతో ఆడమ్ గిల్‌క్రి్‌స్టతో సమంగా నిలిచాడు. ఇక కోరె ఆండర్సన్ (72)తో కలిసి బ్రెండన్ ఐదో వికెట్‌కు 179 పరుగులు (110 బంతుల్లోనే) జోడించాడు. ఈ క్రమంలో 57 బంతుల్లోనే వంద పరుగులు జోడించి టెస్టుల్లో వేగవంతమైన శతక భాగస్వామ్యం నమోదు చేశాడు. 2002లో న్యూజిలాండ్ క్రికెటర్లు నాథన్ ఆస్టల్-క్రిస్ కెయిన్స్ (పదో వికెట్) పేరిట ఉన్న రికార్డును బ్రెండన్-కోరె తుడిచేశారు.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: గప్టిల్ (సి) బర్న్స్ (బి) పాటిన్సన్ 18, లాథమ్ (సి) స్మిత (బి) బర్డ్ 4, కేన్ విలియమ్సన్ 7, నికోలస్ (ఎల్బీ) హాజెల్‌వుడ్ 7, బ్రెండన్ మెకల్లమ్ (సి) లియాన్ (బి) పాటిన్సన్ 145, ఆండర్సన్ (సి) వోజెస్ (బి) లియాన్ 72, వాట్లింగ్ (సి) బర్న్స్ (బి) బర్డ్ 58, టిమ్ సౌథీ (సి) హాజెల్‌వుడ్ (బి) లియాన్ 5, హెన్రీ (సి) ఖవాజా (బి) లియాన్ 21, వాగ్నర్ (సి) నెవిల్ (బి) హాజెల్‌వుడ్ 10, ట్రెంట్ బౌల్ట్ (నాటౌట్) 14, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 65.4 ఓవర్లలో 370 ఆలౌట్; వికెట్ల పతనం: 1-21, 2-23, 3-32, 4-74, 5-253, 6-266, 7-273, 8-297, 9-333; బౌలింగ్: హాజెల్‌వుడ్ 18-5-98-2, పాటిన్సన్ 15-2-81-2, బర్డ్ 14.4-4-66-2, మిచెల్ మార్ష్ 8-1-62-1, లియాన్ 10-0-61-3.
183.54
ఈ మ్యాచ్‌లో బ్రెండన్ స్ట్రయిక్ రేట్. సెంచరీ చేసిన ఇన్నింగ్స్‌లో ఇది రెండో అత్యధికం. వివ్ రిచర్డ్స్ (58 బంతుల్లో 110 నాటౌట్) 189.75తో మొదటి స్థానంలో ఉన్నాడు.
199
తొలి రోజు రెండో సెషన్‌లో 24 ఓవర్లు ఆడిన కివీస్ 8.29 రన్‌రేట్‌తో 199 రన్స్ చేసింది.
12
బ్రెండన్‌కు ఇది 12వ శతకం. కివీస్ తరపున మార్టిన్ క్రో (17), టేలర్, విలియమ్సన్ (13) అతనికంటే ముందున్నారు.
No comments:
Post a Comment