విజయవాడ : అమరావతి రెవెన్యూ డివిజనపై కదలిక వచ్చింది. పోలీసు డివిజన ఇప్పటికే ఏర్పడినా రెవెన్యూ డివిజన్ తాత్సారంపై అసోసియేషన నేతల్లో కూడా ఆగ్రహం పెల్లుబికుతోంది. అమరావతి నేపథ్యంలో, క్షేత్రస్థాయి భూ సమీకరణ విషయంలో రెవెన్యూ అధికారులు పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజధాని పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పరిపాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అమరావతి రెవెన్యూ డివిజనను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని ఉద్యోగనేతలు అభిప్రాయపడుతున్నారు.
సిబ్బంది భర్తీకి అవకాశం అమరావతి రెవెన్యూ డివిజన ఏర్పాటు వల్ల తగినంత సిబ్బంది భర్తీ కావటంతో పాటు, సబ్ కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారి వచ్చే అవకాశం ఉంటుంది. వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు, రెవెన్యూ ఇనస్పెక్టర్లకు కూడా విధులపై స్పష్టత వస్తుంది. పని ఒత్తిడి తగ్గి ఒక క్రమపద్ధతిలో పనిచేసుకునే అవకాశం చిక్కుతుంది. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రెవెన్యూ ఉద్యోగులు ఇటీవల స్థానిక ఉద్యోగ సంఘ నేతలపై ఒత్తిడి తీసుకురావటంతో స్థానిక నేతలు ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన దృష్టికి తీసుకు వెళ్ళారు. దీంతో రె వెన్యూ సంఘ అగ్రనేతలు కూడా రంగంలోకి వచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు భౌగోళికంగా రెండు వేర్వేరు ప్రాంతాలు, జిల్లాలుగా ఉండటం వల్ల అభివృద్ధి పనులు, ప్రాజెక్టులపై సమస్యలు ఎదురౌతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఆర్‌డీఏ పరిధిని ఒక జిల్లాగా చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం గతంలో చేసినా అది కార్యరూపం దాలచ్చడానికి కొంతకాలం పట్టే అవకాశం ఉంది.
సుముఖంగా సీఎస్!
ఈ నేపథ్యంలో, పాలనా పర ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే రెవెన్యూ డివిజనను ఏర్పాటు చేయాల్సిందేనని రెవెన్యూ అసోసియేషన నేతలు భావిస్తున్నారు. రెవెన్యూ డివిజనను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకోవాల్సిందిగా.. రాష్ట్ర అసోసియేషన అగ్రనేత బొప్పరాజు వెంకటేశ్వర్లు, మరికొందరు కలిసి చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్‌ను కలవనున్నారు. గతంలో సీఎస్‌గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు అమరావతి డివిజన ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారు. టక్కర్ దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకు వెళ్ళి.. సంబంధిత ప్రక్రియ వేగంగా ప్రారంభించటానికి చర్యలు తీసుకోవాల్సిందిగా నేతలు కోరనున్నారు.
No comments:
Post a Comment