పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

బ్యాంకుల మొండి బకాయిలపై ‘సుప్రీం’ ఆదేశం


6.8లక్షల కోట్లకు పెరిగిన బకాయిలు
ఒక్క ఏడాదిలోనే 40వేల కోట్ల రద్దు
ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు, పేరుకు పోతున్న నిరర్ధక ఆస్తులపై కోర్టులు కొరడా ఝళిపిస్తున్నాయి. సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో కొంతవరకైనా మేలుజరుగుతుందన్నది స్పష్టంఅవుతోంది. రూ.500 కోట్లకుపై బడి బకాయి ఉన్న బకాయిదారుల జాబితాలను అందచేయాలని సుప్రీం కోర్టు రిజర్వుబ్యాంకును ఆదేశించింది. అలాగే ఆయా కంపెనీల వివరాలు కూడా అందచేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే ఏఏకంపెనీల రుణాలనుపునర్‌ వ్యవస్థీకరించిందీ ఆ కంపెనీల జాబితా కూడా తమకు అందచేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. సరైన నియమ నిబందనలు పాటించకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈవిధంగా భారీ రుణాలు ఎలా ఇచ్చాయని కూడా ప్రశ్నించింది. అంతేకాకుండా వీటిరికవరీకి అవసరమైన యంత్రాంగం ఉందా లేదా అని కూడా ప్రశ్నించింది. కార్పొరేట్‌ సామ్రాజ్యాలు నడుపుతున్న మహా మహుల జాబితా మీవద్దనే ఉంది. వీరి బకాయిల వివరాలను కూడామాకు అందించండి అని ప్రశ్నిం చింది. దేశంలోని ప్రముఖ దినపత్రికలన్నింటి లోనూ మొత్తం 29 ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు 1.14లక్షల కోట్లుగా ఉన్నా యని, డాలర్లలోచూస్తే 16.7 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ప్రకటించాయి. ఇవన్నీ కూడా గడచిన రెండేళ్లనుంచే ఉన్నాయని అంతకుముందున్న వాటిసంగతేమిటని న్యాయ మూర్తులు ప్రశ్నించారు. సర్వోన్నతన్యాయస్థానం కోరిన వివరాలను సీల్డ్‌కవర్‌లో అందచేయాలని సూచించింది. న్యాయవాది ఉద్యమకారుడు ప్రశాంత్‌భూషణ్‌ దాఖలుచేసిన కేసు విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నోటీసులు ఈ ఆదేశాలు జారీచేయడం ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వరంగంలోని హడ్కో కేటాయించిన రుణాలు మొత్తం 14వేల కోట్ల వరకూ ఉన్నాయని ఇవన్నీ రెండువేల సంవత్సరంలోనే కేటాయించిందని అయితే ప్రభుత్వరంగ బ్యాంకులు కేటా యించిన 40 వేల కోట్ల రూపాయలను ఒక్క సంవత్సరంలోనే గత ఏడాది రద్దు చేసిన అంశాన్ని ఉటంకిస్తూ వీటిపై విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రానిబాకీలు పేరుకుపోతుండటం, సాక్షాత్తూ రిజర్వుబ్యాంకు కూడా గడచిన రెండు త్రైమాసికాల నుంచి బ్యాంకులను హెచ్చరిస్తున్న నేపథ్యం లో సుప్రీం ఆదేశాలు మరింత ఊతం ఇచ్చాయి. వీటికితోడు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో కూడా మూడోత్రైమాసికంలో రానిబాకీల ప్రభావం మరింతగా కనిపించింది. ప్రతి బ్యాంకులోను రానిబాకీల కేటాయింపులు పెంచుతూ రావ డంతో రిజర్వుబ్యాంకు ముక్కుపిండి వసూలు చేయాలన్న ఆదేశాలను అద్దం పట్టింది. ఇప్పటికే భారతీయ రిజర్వుబ్యాంకు 2017 మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఆస్తిఅప్పుల పట్టీలను ప్రక్షాళన చేసుకోవాలని ఆదేశించింది. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ లో రానిబాకీలు మొత్తం 100 బిలియన్‌ డాలర్లువరకూ ఉన్నట్లు అంతర్జాతీయ సర్వే సంస్థలు అంచనాలు వేసాయి. అలాగే భారతీయ కరెన్సీలో చూస్తే ఈమొత్తం 6.8 లక్షల కోట్లకు సమానంగాఉంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే రాని బాకీల్లో మొత్తం 85శాతం రావాల్సిఉంది. ఓవైపు విదేశాల్లో నిక్షిప్తంచేసిన నల్లధనాన్ని భారత్‌కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సుప్రీం పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. ఇందుకోసం సుప్రీం మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ సిట్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. సత్వర దర్యాప్తుకు ఉపక్రమించిన సిట్‌ తన ప్రగతి నివేదికలను సుప్రీంకు అందచేస్తూవస్తోంది. ఆర్థికవ్యవస్థలో అత్యంత కీలకమైన బ్యాంకింగ్‌ వ్యవస్థలో పెరిగిపోతున్న మొండిబకాయిలు, రానిబాకీ లు నిరర్ధక ఆస్తులు ఇలా వివిధ రూపాల్లో ఉన్న ఈ బకాయిలను ఓ కొలిక్కితీసుకురావాలంటే సుప్రీంకోర్టులాంటి న్యాయవ్యవస్థలు జోక్యం అనివార్య మని మేధావులు, ఆర్థికరంగనిపుణులు భావిస్తున్న తరుణంలోసుప్రీం తాజా ఆదే శాలుకార్పొరేట్‌, మొండిబకాయిదారుల్లో గుబులురేపుతాయనడంలో సందేహం లేదు.

No comments:

Post a Comment