పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

రింగింగ్‌బెల్స్‌ నుంచి ఫ్రీడమ్‌251 స్మార్ట్‌ఫోన్‌


Freedom-251-Front-new-624x351
న్యూఢిల్లీ : రింగింగ్‌బెల్స్‌ దేశీయ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ భారత్‌ కస్టమర్ల కోసం కారు చౌక స్మార్ట్‌ ఫోన్‌ను ప్రవేశపెడుతోంది. రక్షణ మంత్రి మనోహర్‌ పారిక్కర్‌ ఈ ఫోన్‌ బుకింగ్స్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఫ్రీడమ్‌ 251 పేరిట విడుదలయ్యే ఈఫోన్‌ బుకింగ్స్‌ గురువారం ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభం అవుతాయి. 21వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ముగుస్తాయి. భారతీయ మొబైల్‌ మార్కెట్‌లో కొత్తగా ప్రవేశిస్తున్న ఈ కంపెనీ 4జి స్మార్ట్‌ఫోన్‌ను 2999 లకే అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే మరో రెండు ఫీచర్‌ ఫోన్లను మార్కెట్‌కు ప్రవేశపెట్టింది. ఫ్రీడమ్‌ 251 స్మార్ట్‌ ఫోన్‌కు సంబంఒధించి డ్యూయల్‌సిమ్‌3జి సామర్ధ్యంతో ఉంటుంది. నాలుగు అంగుళాల డబ్ల్యు విజిఎ డిస్‌ప్లేతోపాటు 1.3జిహెచ్‌జడ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌తో ఉంటుంది. ఫ్రీడమ్‌ 251 స్మార్ట్‌ఫోన్‌ వన్‌జిబి రామ్‌తోపాటు 8జిబి మొత్తం నిల్వ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఫ్రీడమ్‌ 251 స్మార్ట్‌ఫోన్‌కు 3.2 మెగాపిక్సెల్‌ కెమేరా వెనుకవైపు 0.3 మెగాపిక్సెల్‌ కెమేర ముందువైపు ఉన్నాయి. 1450 ఎంఎహెచ్‌ బ్యాటరీతో శక్తివంతంగా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది.

No comments:

Post a Comment