
హైదరాబాద్ : పంటినొప్పి ఇతర దంత క్షయ వ్యాధుల నుంచి సత్వర ఉపశమనం కోసం కాల్గేట్ తొలిసారి పెయిన్ ఔట్‌ను విడుదల చేసింది. ఒక్క చుక్క పెయిన్ ఔట్‌తో నొప్పి వేగంగా నివారించవచ్చని చెపుతోంది. పిన్నవయస్కులే కాకుండా మధ్యవయస్కుల్లో కూడా పంటి నొప్పితో బాధపడుతున్నవారు అనేక మంది ఉన్నారని, కంపెనీ చెపుతూ ఎలాంటి పంటి నొప్పినుంచైనా సరే, సత్వరమే పెయిన్‌ఔట్ ఉపశమనం ఇస్తుందని పేర్కొన్నారు. కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ ఎరిక్ జొంబర్ట్ మాట్లాడుతూ దంతక్షయం నుంచి ఉపశమనం పొందేందుకు ఇప్పటికే కాల్గేట్ అనేక ఉత్పత్తులు అందించిందని, తాజాగా పంటినొప్పి నుంచి ఉపశమనం కోసం పెయినౌట్‌ను తెచ్చామని పేర్కొన్నారు. పదిగ్రాముల ప్రీమియం ప్యాక్ రూ.50లుగా ఉంది.
No comments:
Post a Comment