‘పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో చేరిస్తేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని పట్టుబట్టా. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే తొలి కేబినెట్ భేటీలోనే ముంపు మండలాలను ఏపీలో చేర్చారు’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సీలేరు ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు రావడం వల్లే గోదావరి డెల్టాకు నీరు ఇవ్వగలిగామన్నారు. ఏపీలో కలిపిన పోలవరం ముంపు గ్రామాల్లో కొన్నిటిని తిరిగి తెలంగాణకు ఇస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు సీఎం దృష్టికి తీసుకురాగా.. ‘ఆ విషయంపై నాకు సమాచారం లేదు. ఆయన ఏ గ్రామాలు అడిగారో తెలియదు’ అని స్పందించారు. కాగా, పోలవరం నిర్మాణ వ్యయం విషయంలో పలు ప్రత్యామ్నాయాలు పరిశీలనలో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.
Sunday, 21 February 2016
‘ఆయన ఏ గ్రామాలు అడిగారో’: చంద్రబాబు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment