రెండు గంటలపాటు చర్చలు జరిపారు. అనంతరం కేఈ మీడియాతో మాట్లాడారు. భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ టీడీపీలో చేరే విషయంలో తమకు ఎలాంటి సృష్టత లేదన్నారు. దీనిపై బాబు వద్ద కూడా సమాచారం లేనట్టు ఉందని, ఆయన కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారని తెలిపారు. కానీ ఆయన పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటే మాత్రం తమకెవరికీ అభ్యంతరం లేదన్నారు. ’భూమా టీడీపీలోకి రాకుండా చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జగన వ్యక్తిగతంగా కూడా వారిలో మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకే చేరికను 25వ తేదీకి వాయిదా వేశారు. భూమా చేరికపై మాకు అనుమానాలున్నాయి. చేరతానని ఆయన కచ్చితంగా నిర్ధారిస్తే ఆహ్వానిస్తాం‘ అరి హామీ ఇచ్చారు. అంతక్రితం సీఎంను కలవడానికి ముందు కేఈ ’ఏబీఎన్-ఆంధ్రజ్యోతి‘తో మాట్లాడుతూ.. టీడీపీకి చెందిన 21 ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని జగన్ వ్యాఖ్యనించడం ఆవివేకమని అన్నారు. జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే తమ పార్టీ వాళ్లు కౌంటర్ ఇచ్చారన్నారు. తాము తల్చుకుంటే ఆు పార్టీలో ఎవరూ మిగలరని హెచ్చరించారు. సీఎతో భేటీ తర్వాత శిల్పా మోహన్‌రెడ్డి, చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి తాము చెప్పాల్సింది చెప్పామన్నారు. తొందరపాటు, అందోళన అవసరం లేదని సీఎం అన్నారని చెప్పారు. ఈ విషయంపై మరోసారి తమతో చర్చించాక సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అనంతరం టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ... చంద్రబాబు నాయకత్వం, అభివృద్ధిని చూసే కొంత మంది పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. చాలా జిల్లాల్లో చాలా మంది తమతో టచలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
Sunday, 21 February 2016
భూమా ఓకే అంటే మేమూ రెడీ: కేఈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment