బన్నీ-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘సరైనోడు’ టీజర్ వచ్చేసింది. ఈ టీజర్‌లో అల్లు అర్జున్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ‘‘ ఎర్రతోలు కదా...స్టైల్‌గా ఉంటాడనుకుంటున్నావేమో...మాస్..ఊర మాస్’’ అంటూ పవర్‌ఫుల్‌గా డైలాగు చెప్పాడు బన్నీ. మాస్ దర్శకుడిగా పేరొందిన బోయపాటి బన్నీని నిజంగానే ఊర మాస్‌లా తీర్చిదిద్దినట్టున్నాడు.
ఇదిలా ఉంటే... ఈ ఫస్ట్ టీజర్‌ను రేపట్నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరుతో కలిపి మొత్తం వెయ్యికి పైగా థియేటర్స్‌లో ఈ టీజర్‌ను ప్రదర్శించబోతున్నారట. ప్రస్తుతం ఈ సినిమాలో పాటకోసం అన్నపూర్ణ ఏడెకరాల్లో కోటిన్నర వ్యయంతో రూపొందించిన సెట్‌లో చిత్రీకరణ జరిగింది. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో సిజర్ నేతృత్వంలో 300 మంది డాన్సర్ల మధ్య బన్నీ, కేథరిన్‌పై ఓ పాటను చిత్రీకరించారు. గీతాఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ నటిస్తుండగా...థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ‘లెజెండ్’తో జగపతిబాబును తిరుగులేని విలన్‌గా చూపించిన బోయపాటి శ్రీను.. ‘సరైనోడు’తో ఆది పినిశెట్టిని విలన్‌గా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీ-ఆది మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయట. ఇదిలాఉంటే...ఆది హీరోగా నటించిన ‘మలుపు’ రేపే ప్రేక్షకుల ముందుకొస్తుంది.
No comments:
Post a Comment