పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

రాంచరణ్‌ పదో సినిమా..


రాంచరణ్‌ పదో చిత్రం గురువారం హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్‌ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తమిళంలో రూ. వంద కోట్లు వసూలు చేసిన ‘తని ఒరువన్’కి రీమేకిది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్‌ నిర్మాత. రకుల్‌ప్రీత్ సింగ్‌ కథానాయిక. అరవింద్‌ స్వామి కీలక పాత్రధారి. ‘మగధీర’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత రాంచరణ్‌తో గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న చిత్రమిది. ఈ నెల 22 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారు. పోసాని కృష్ణమురళీ, నాజర్‌, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అసీమ్‌ మిశ్రా, సంగీతం: హిప్‌హాప్‌ ఆది, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: నవీన్ నూలి, కో.ప్రొడ్యూసర్‌: ఎన్వీ.ప్రసాద్‌.

No comments:

Post a Comment