- నేను డైరెక్టర్‌ను కాను..
- బాధ్యతల నుంచి తప్పుకొని 15 ఏళ్లయింది
- వివాదాలకు కంపెనీలదే బాధ్యత..
- వివరణ వాటినే అడగాలి
- మంత్రి పదవి చేపట్టే ముందు వరకూ ఆయనే డైరెక్టర్
- 2014 అక్టోబరు 15 వరకూ బాధ్యతల్లోనే
సుజనా టవర్స్, సుజనా యూనివర్సల్ తదితర కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని కేంద్ర మం త్రి సుజనా చౌదరి చెప్పారు. పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం తర్వాత తన నివాసం లో విలేకరుల సమావేశంలో టీడీపీ లోక్‌సభాపక్ష నాయకుడు తోట నరసింహంతో కలిసి ఆయన మాట్లాడారు. ‘‘ఆ కంపెనీలకు ఇప్పు డు నేను డైరెక్టర్‌ను కాదు. కంపెనీల బాధ్యతల నుంచి తప్పుకొని 15 ఏళ్లయింది. సుజనా యూనివర్సల్ సంస్థ మారిషస్ బ్యాంకు నుం చి రుణం తీసుకున్నప్పుడు కూడా నేను సంతకాలు చేయలేదు. ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతల్లో మాత్రమే ఉన్నాను. ఆయా కంపెనీల వివాదాల గురించి సంబంధిత కంపెనీలనే అడగాలి’’ అన్నారు. తన పేరిట సమన్లు జారీ అయినట్లు తనకు తెలియదని, తనకు ఎలాంటి సమన్లు అందలేదని తెలిపారు. అయినా, ప్రధాని నరేంద్ర మోదీ పేరిట కూడా సమన్లు జారీ అవుతుంటాయని, అలాగే, తన పేరిట కూడా జారీ అయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. మీడియాలో ఏం రాసినా తనకు నష్టం లేదన్నారు.
రెండేళ్ల క్రితం వరకూ ఆయనే..
కేంద్రంలో మంత్రి పదవి చేపట్టడానికి ముందు వరకూ సుజనా యూనివర్సల్ తదితర కంపెనీలకు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌ దరి) డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ కంపెనీతో తనకు సంబంధం లేదంటూ సుజనా చౌదరి చేసిన ప్రకటనలో వాస్తవం లేదు. ఈ కంపెనీలో ఆగస్టు 22, 1986 నుంచి 2014 అక్టోబర్ 15 వరకు ఆయన డైరెక్టర్‌గా కొనసాగారు. మారిషస్ బ్యాంకు నుంచి సుజనా యూనివర్సల్ అనుబంధ కంపెనీ హేస్టియా హోల్డిం గ్స్ 2012లో రూ.92 కోట్ల రుణాన్ని తీసుకుంది. రుణం తీసుకున్న సమయంలోనూ.. రుణం ఎగవేత దరిమిలా దీనిపై మారిషస్ బ్యాంకు అంతర్జాతీ య న్యాయస్థానాలను ఆశ్రయించిన సమయంలోనూ సుజనా యూనివర్సల్ లో ఆయన డైరెక్టర్‌గా ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పదిహేనేళ్లుగా ఆయా కంపెనీలతో తనకు సంబంధం లేదని సుజనా ప్రకటించడంపై ఆ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. సుజనా గ్రూప్ కంపెనీల్లో 2014 వర కూ చురుగ్గా ఉన్న చౌదరి.. రాజకీయాల్లో క్రియాశీలంగా ప్రవేశించిన తర్వాత డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఇదే గ్రూప్‌లోని మరో ముఖ్య కంపె నీ సుజనా టవర్స్‌లో ఆయన 1992 ఫిబ్రవరి 13 నుంచి 2014 అక్టోబర్ 15 వరకు డైరెక్టర్‌గా ఉన్నారు. సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా పవర్ (గంగికొండన్) లిమిటెడ్, సుజనా పవర్ ఇండియా, సుజనా పవర్ (ట్యూటికోరిన్), సు జనా ఎనర్జీ, సుజనా ఫైనాన్స్ అండ్ ట్రేడింగ్, సుజనా హోల్డింగ్స్ లిమిటెడ్, సు జనా ప్రాజెక్ట్స్ తదితర సంస్థలన్నింటిలోనూ 2014 అక్టోబర్ 15 వరకు ఆయన డైరెక్టర్‌గా కొనసాగారు. ఇవే కాకుండా ఫోస్టర్ ఇన్‌ఫిన్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో 2014 అక్టోబర్ 15 వరకు; ఆఫ్‌బీట్ డెవలపర్స్ ప్రైవే ట్ లిమిటెడ్ కంపెనీలో 2010 జనవరి 29 వరకు సుజనా డైరెక్టర్‌గా ఉన్నారు.
Tuesday, 23 February 2016
సుజనా కంపెనీలతో నాకు సంబంధం లేదు: సుజనా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment