- రాష్ర్టానికి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్
- అమరావతికి అధునాతన టెలిఫోన ఎక్స్ఛేంజ్
- ఐటీఐఆర్ ఏర్పాటు కూడా పరిశీలిస్తాం
- గుంటూరులో ఈ-కామర్స్ సెంటర్
- పార్సిల్ హబ్‌లుగా విజయవాడ, విశాఖ, తిరుపతి
- ‘సమీర్’కు శంకుస్థాపనలో కేంద్ర మంత్రి రవిశంకర్
ఒకప్పుడు ముందంజలో ఉన్న చైనాతో సహా ప్రపంచమంతా ఇప్పుడు ఆర్థిక మాంద్యంలో ఉందని, భారతదేశం మాత్రం వాటికి అతీతంగా 7.3 శాతం వృద్ధిరేటుతో అభివృద్ధి పథాన ముందుకు వెళుతోందని మంత్రి రవిశంకర్ అన్నారు. జీడీపీలో భారతదేశం రెండంకెల అభివృద్ధికి యత్నిస్తోందని, ప్రపంచానికి ప్రస్తుతం భారతదేశమే ఆశాకిరణంగా ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 100 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని, ఈ సంఖ్య యూరప్, ఇంగ్లండ్ దేశాల్లోని సంఖ్య కంటే అధికమన్నారు. దేశంలో 40 కోట్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని, 2017 నాటికి దీన్ని 50 కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అయితే ఈ ఏడాది చివరికే లక్ష్యం సాధించగలుగుతామని మంత్రి చెప్పారు.
సమీర్ ఉపయోగం ఏంటి?
స్వయం ప్రతిపత్తి గల ‘సమీర్’... ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దీనికి దేశంలో 3 శాఖలు ఉండగా విశాఖలో కీలకమైన నాలుగో శాఖను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి రవిశంకర్ వివరించారు. ఇది దేశ రక్షణ రంగానికి అవసరమైన కీలక పరిశోధనలు చేస్తుందన్నారు. ఈ కేంద్రం ప్రత్యేకంగా ఎలకో్ట్ర మ్యాగ్నటిక్ ఎన్విరానమెంటల్ ఎఫెక్ట్స్(ఈ3)పై పరిశోధనలు నిర్వహిస్తుంది. కీలకమైన కంప్యూటర్ వ్యవస్థలను విద్యుత అయస్కాంత తరంగాలు నిర్వీర్యం చేస్తున్నాయని, వాటిని నిరోధించేందుకు అవసరమైన పరిశోధనలు ఇందులో జరుగుతాయన్నారు. ‘సమీర్’ కోసం విశాఖకు సమీపానున్న గంభీరం సెజ్‌లో రాష్ట్ర ప్రభుత్వం 13 ఎకరాలు ఉచితంగా కేటాయించింది. కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ దీనికి రూ.80 కోట్లు మంజూరు చేసింది.
ఇంక్యుబేషన సెంటర్ నిర్మాణం ఇలా..
ఇన్నోవేషన ఇంక్యుబేషన సెంటర్‌ను ఉడాతో కలిసి ఎస్‌టీపీఐ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.62.7 కోట్లు. ఉడా రూ.16.7 కోట్ల విలువైన భూమి సమకూరుస్తుండగా, ఎస్‌టీపీఐ రూ.46 కోట్ల నిధులు అందిస్తోంది. దీనితో 11 అంతస్థుల భవనం నిర్మిస్తారు. 62వేల చదరపు అడుగుల స్థలాన్ని ఐటీ కంపెనీలకు కేటాయిస్తారు. ఇందులో 2,500 మందికి ఉపాధి లభిస్తుంది. ఏటా రూ.300 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలనేది లక్ష్యం.
‘‘ఐటీ+ఐటీ=ఐటీ. అంటే... ఇండియన టాలెంట్+ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ=ఇండియా టుమారో. ప్రస్తుతం ప్రపంచానికి భారతదేశమే ఆశాకిరణం. విశాఖపట్నానికి ‘సమీర్’ గర్వకారణంగా నిలిస్తుంది. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఎల్‌ఈడీ దీపాలు వంటివి భారీ ఎత్తున భారతలో ఉత్పత్తి చేయాల్సిన అవసరముంది. ఇందులో ఏపీ పాత్ర కీలకం’’
కొత్త ఐడియాల చంద్రబాబు
దేశంలో 125 కోట్ల జనాభా ఉంటే వారిలో 97 కోట్ల మందికి ఆధార్ వుందని, ఆంధ్రప్రదేశ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ఆధార్‌ను అనుసంధానం చేసి వెయ్యి కోట్ల రూపాయలకుపైగా దుర్వినియోగాన్ని అరికట్టిందని మంత్రి రవిశంకర్ అన్నారు. దేశానికి నాలెడ్జ్ ఎకానమీ అవసరమని, ఇందుకోసం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు భూగర్భం ద్వారా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేస్తున్నామన్నారు. అయితే ఏపీలో ఖర్చు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు వినూత్నంగా విద్యుత స్తంభాల ద్వారా కేబుల్‌ను వేస్తున్నారని, దాన్ని అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నిపుణులను ఏపీకి పంపుతామని మంత్రి రవిశంకర్ పేర్కొన్నారు. చంద్రబాబు తరచూ తనను కలుస్తుంటారని, మాట్లాడినపుడల్లా కొత్త ఐడియా చెబుతుంటారని, ఆయన్ను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉందన్నారు. ఏపీలో గుంటూరుకు ఈ-కామర్స్ సెంటర్‌ను మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. అలాగే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను ఈ-కామర్స్ పార్శిల్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీలో అన్ని పోస్టాఫీసులను డిజిటల్ కేంద్రాలుగా మారుస్తామన్నారు.
రాజధానికి కేంద్ర సంస్థలు
ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యేకంగా అధునాతన బీఎ్‌సఎనఎల్ టెలిఫోన ఎక్స్ఛేంజీ మంజూరు చేస్తున్నామని, జూన్ కల్లా ఏర్పాటు చేస్తామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో బీఎ్‌సఎనఎల్ సంస్థ రూ.10 వేల కోట్ల లాభంలో ఉండేదని, గత పదేళ్లలో ఇది రూ.8 వేల కోట్ల నష్టాలను మూటగట్టుకుందన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి రాగానే గడచిన 15 నెలల్లో రూ.670 కోట్లతో లాభాలబాటలోకి తీసుకొచ్చామన్నారు. ఏపీకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎనఐసీ) కావాలని సీఎం చంద్రబాబు కోరగా... పరిశీలిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అయితే ఇదే వేదికపై ఉన్న మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కల్పించుకొని... పరిశీలించడం కాదని, వెంటనే మంజూరు చేయాలని కోరారు. దీంతో, ఎనఐసీ ఏపీకి ఇస్తున్నట్టు మరుక్షణమే మంత్రి రవిశంకర్ ప్రకటన చేశారు. ఏపీకి ఇన్ఫర్మేషన టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన(ఐటీఐఆర్) మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. కేంద్రం ఐటీఐఆర్ విధానాన్ని సమీక్షిస్తోందని, అది పూర్తికాగానే పరిశీలిస్తామని మంత్రి రవిశంకర్ హామీ ఇచ్చారు. విశాఖ ఎంపీ హరిబాబు కోరినవన్నీ పరిశీలిస్తామని, అయితే ముందుగా విశాఖను క్లౌడ్ సర్వీసెస్ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, విశాఖపట్నం అద్భుతమైన నగరమని, స్మార్ట్‌సిటీగా తొలి జాబితాలో ఎంపికైందని, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఐదో స్థానం సాధించిందని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు. భారతదేశం రూపాంతరం చెందుతున్నదని చెప్పడానికి విశాఖలోని సమీర్ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. సమీర్ ఉపయోగం ఏంటి?
స్వయం ప్రతిపత్తి గల ‘సమీర్’... ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దీనికి దేశంలో 3 శాఖలు ఉండగా విశాఖలో కీలకమైన నాలుగో శాఖను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి రవిశంకర్ వివరించారు. ఇది దేశ రక్షణ రంగానికి అవసరమైన కీలక పరిశోధనలు చేస్తుందన్నారు. ఈ కేంద్రం ప్రత్యేకంగా ఎలకో్ట్ర మ్యాగ్నటిక్ ఎన్విరానమెంటల్ ఎఫెక్ట్స్(ఈ3)పై పరిశోధనలు నిర్వహిస్తుంది. కీలకమైన కంప్యూటర్ వ్యవస్థలను విద్యుత అయస్కాంత తరంగాలు నిర్వీర్యం చేస్తున్నాయని, వాటిని నిరోధించేందుకు అవసరమైన పరిశోధనలు ఇందులో జరుగుతాయన్నారు. ‘సమీర్’ కోసం విశాఖకు సమీపానున్న గంభీరం సెజ్‌లో రాష్ట్ర ప్రభుత్వం 13 ఎకరాలు ఉచితంగా కేటాయించింది. కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ దీనికి రూ.80 కోట్లు మంజూరు చేసింది.
ఇంక్యుబేషన సెంటర్ నిర్మాణం ఇలా..
ఇన్నోవేషన ఇంక్యుబేషన సెంటర్‌ను ఉడాతో కలిసి ఎస్‌టీపీఐ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.62.7 కోట్లు. ఉడా రూ.16.7 కోట్ల విలువైన భూమి సమకూరుస్తుండగా, ఎస్‌టీపీఐ రూ.46 కోట్ల నిధులు అందిస్తోంది. దీనితో 11 అంతస్థుల భవనం నిర్మిస్తారు. 62వేల చదరపు అడుగుల స్థలాన్ని ఐటీ కంపెనీలకు కేటాయిస్తారు. ఇందులో 2,500 మందికి ఉపాధి లభిస్తుంది. ఏటా రూ.300 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలనేది లక్ష్యం.
‘‘ఐటీ+ఐటీ=ఐటీ. అంటే... ఇండియన టాలెంట్+ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ=ఇండియా టుమారో. ప్రస్తుతం ప్రపంచానికి భారతదేశమే ఆశాకిరణం. విశాఖపట్నానికి ‘సమీర్’ గర్వకారణంగా నిలిస్తుంది. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఎల్‌ఈడీ దీపాలు వంటివి భారీ ఎత్తున భారతలో ఉత్పత్తి చేయాల్సిన అవసరముంది. ఇందులో ఏపీ పాత్ర కీలకం’’
No comments:
Post a Comment