పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 23 February 2016

జేఎన్‌యూలో రోజుకు 3000 కండోమ్‌లు

  •  రాజస్థాన్‌ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు 


  • జేఎన్‌యూ రగడ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే గ్యాన్‌దేవ్‌ అహూజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వర్సిటీ విద్యార్థులు తాగుబోతులు, తిరుగుబోతులు అనే అర్థం వచ్చేలా.. జేఎన్‌యూ ప్రాంగణంలో రోజుకు 3000 వాడిన కండోమ్‌లు, వేలకొద్దీ మద్యం సీసాలు కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జేఎనయూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలని, క్యాంప్‌సలో కనిపించే అల్యూమినియం ఫాయిల్సే ఇందుకు నిదర్శనమన్నారు. జాతి వ్యతిరేకులైన విద్యార్థులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఆయన ద్రోహిగా, జాతివ్యతిరేకిగా అభివర్ణించారు. రాహుల్‌ను ఉరితీయాలని, కాల్చిపారేయాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, వామపక్షాలు భారత వ్యతిరేక పార్టీలని ఆరోపించారు.

No comments:

Post a Comment