క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై కేరళలోని మలబార్ క్రిస్టియన్ కాలేజీలో ఓ ప్రత్యేక లైబ్రరీ ని ఏర్పాటు చేశారు. ‘22 యార్డ్స్ టు ఫ్రీడమ్’ పేరుతో ఏర్పాటైన గ్రంథాలయంలో సచిన్‌కు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ లైబ్రరీలో వివిధ క్రికెటర్లకు సంబంధించిన పుస్తకాలు ఉన్నా.. ‘22 యార్డ్స్ టు ఫ్రీడమ్’ మాత్రం సచిన్ స్పెషల్. ఇందులో 7 భాషల్లోని సచిన్ పుస్తకాలు అందుబాటులో ఉంటాయని ఈ లైబ్రరీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ వశిష్ఠ చెప్పారు. మాస్టర్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడే ఈ గ్రంథాలయాన్ని నెలకొల్పాలనే ఆలోచన వచ్చిందని సచిన్ వీరాభిమాని వశిష్ఠ తెలిపారు.
No comments:
Post a Comment