కొలంబో: ఆసియా కప్, వరల్డ్ టీ-20లో శ్రీ లంక జట్టుకు పేసర్ లసిత మలింగ నేతృ త్వం వహించనున్నాడు. మోకాలి గా యం నుంచి కోలుకు న్న రెగ్యులర్ కెప్టెన్ మలింగకు లంక బోర్డు మళ్లీ సారథ్యాన్ని అప్పగించింది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన మలింగ.. న్యూజిలాండ్, భారత్ పర్యటనలకు దూరమయ్యాడు.
దీంతో చాందిమల్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆసియా కప్, టీ-20 వరల్డ్‌క్‌పలకు లంక జట్టును కూడా ప్రకటించారు. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూ స్, సీమర్ నువాన్ కులశేఖర, స్పిన్నర్ రంగన హెరాతలకు కూడా సెలక్టర్ల నుంచి పిలుపు అందింది.
No comments:
Post a Comment