ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రాయబారాలు విఫలమయ్యాయి. భూమా నాగిరెడ్డితో పాటు మరో 10నుంచి 12మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరతారని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీళ్లంతా విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవాలని ముహూర్తాలు కూడా నిర్ణయించుకున్నారని తెలిసింది.
కాగా భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె నిశ్చితార్థం దగ్గర్లో ఉంది అయితే ఆ నిశ్చితార్థం ముందు కానీ ఆ తర్వాత కానీ వైసీపీకి గుడ్ బాయ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా టీడీపీలోకి భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియతో సహా మరో పదిమంది వైసీపీ ఎమ్మెల్యేలు చేరడం ఖాయమని సమాచారం.
No comments:
Post a Comment