పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

మళ్లీ తెరపైకి భారత్ X పాకిస్థాన్

  • బీసీసీఐ సానుకూల స్పందన
  • కేంద్రంతో సంప్రదింపులు
 భారత-పాకిస్థాన క్రికెట్‌కు మార్గం సుగమం అవుతోంది. సిరీస్‌ నిర్వహించేందుకు అనుమతించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) దీపావళి తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలున్నాయి. అయితే ఈ ద్వైపాక్షిక సిరీ్‌సను తటస్థ వేదికైన యూఏఈలో నిర్వహించడానికి మాత్రం బీసీసీఐ ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం నుంచి గ్రీనసిగ్నల్‌ లభిస్తే భారత వేదికగా ఐదు వన్డేలు, రెండు టీ-20 లేదా మూడు వన్డేలు, రెండు టీ-20ల సిరీ్‌సను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సిరీస్‌ నిర్వహిస్తేనే బాగుంటుందని ఇండియన ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చైర్మన రాజీవ్‌ శుక్లా తెలిపారు. ఇక అంతిమంగా భారత, పాక్‌ ప్రభుత్వాల నిర్ణయాలపైనే సిరీస్‌ భవితవ్యం ఆధారపడి ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ కూడా అయిన బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో దీపావళి అనంతరం భేటీ కానున్నట్టు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ‘రాజకీయాల కారణంగా క్రికెట్‌ దెబ్బ తినకూడదన్నదే మా అభిమతం. రాజకీయ పార్టీల గొడవలు లేని వేదికల్లో ఈ మ్యాచలను నిర్వహించాలని భావిస్తున్నా’మని ఆయన చెప్పుకొచ్చారు. 
 
పాక్‌ ప్రభుత్వ నిర్ణయం తర్వాతే..
గత నెలలో ద్వైపాక్షిక సిరీస్‌ కోసం బీసీసీఐతో చర్చించేందుకు పాకిస్థాన క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన షహర్యాన ఖాన భారతకు రావడంపై పాక్‌ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో జరగాల్సిన ఈ చర్చలను శివసేన కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ద్వైపాక్షిక సిరీస్‌పై పీసీబీ ఆశలు పెట్టుకున్నా.. పాక్‌ ప్రభుత్వ నిర్ణయం తర్వాతే సిరీ్‌సపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, డిసెంబర్‌ 7న దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ ముగుస్తుంది. తర్వాత భారతకు మరో సిరీస్‌ లేదు. జనవరిలో మాత్రమే స్వల్ప కాలిక సిరీస్‌ కోసం ఆస్ర్టేలియా టూర్‌కు టీమిండియా వెళ్లనుంది. ఈ మధ్యలో భారత-పాక్‌ సిరీస్‌ నిర్వహిస్తే బాగుంటుందని ఇరు దేశాల బోర్డులు భావిస్తున్నాయి. కాగా భారత-పాక్‌ క్రికెట్‌ బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు జట్ల మధ్య 2015, 2023 సంవత్సరాల్లో రెండేసి సార్లు ద్వైపాక్షిక సిరీ్‌సలు జరగాల్సివుంది. ఈ సిరీ్‌సల్లో ఇరు దేశాలు 14 టెస్ట్‌లు, 30 వన్డేలు, 12 టీ-20లు ఆడాల్సివుంది. 
 
ఈ సిరీస్‌జరగదు 
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత-పాకిస్థాన మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరిగే అవకాశం లేదని టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌ తెలిపారు. ‘ఈ ఏడాది చివర్లో ద్వైపాక్షిక సిరీస్‌ జరగదనే భావిస్తున్నా. బోర్డులోని సభ్యులు కూడా భారతీయులే. ఉగ్రవాదంపై వారు వాస్తవ పరిస్థితులు గ్రహించాలి. సరిహద్దులో పాక్‌ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సరిహద్దుల్లో శాంతి నెలకొనే వరకూ ఈ సిరీ్‌సపై చర్చలు జరపకూడద’ని కీర్తి ఆజాద్‌ అన్నారు. 

No comments:

Post a Comment