పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

సైనా తొలి పోరు నేడే

చైనా ఓపెన్ బ్యాడ్మింటన్

 గత ఏడాది చైనా గడ్డపై సంచలన విజయాలను సొంతం చేసుకున్న భారత ఏస్‌ షట్లరు కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్‌లో మరోసారి చైనా ఓపెన్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. కానీ బుధవారం నుంచి మొదలుకానున్న చైనా ఓపెన్ టోర్నీలో సైనా, శ్రీకాంత్‌లు  టైటిళ్లను నిలబెట్టుకోవడం పె ద్ద సవాలే..! నెహ్వాల్‌ ఫిట్‌నెస్‌ లేమితో సతమతమవుతుండగా, లినడాన్ లాంటి మేటి ఆటగాడిని వరుస గేమ్‌ల్లో ఓడించి సంచలనం సృష్టించిన కిడాంబి.. ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. బుధవారం జరిగే తొలి రౌండ్‌లో ప్రపంచ నెం:2 సైనా.. సన యు (చైనా)తో తలపడనుంది. సనపై సైనాకు 4-1తో మెరుగైన రికార్డు ఉన్నా.. ఈ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోకూడదని సైనా భావిస్తోంది. నెహ్వాల్‌ క్వార్టర్స్‌కు చేరితో.. థాయ్‌ షట్లర్‌ రచనోక్‌ ఇంటాననతో తలపడే అవకాశం ఉంది. మరో టాప్‌ షట్లర్‌ పీవీ సింధు కూడా మెరుగైన ప్రదర్శన కనబరచాలని భావిస్తోంది. తొలి రౌండ్‌లో సింధు.. సెనియా పొలిక్‌పొవా (రష్యా)తో తలపడనుంది. ఈ రౌండ్‌ను అధిగమిస్తే రెండో రౌండ్‌లో వాంగ్‌ షిజియాన రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురయ్యే అ వకాశం ఉంది. అయితే పురుషుల సింగిల్స్‌లో బరిలో ఉన్న శ్రీకాంత్, అజయ్‌ జయరామ్‌లకు కష్టమైన డ్రా ఎదురైంది. తొలి రౌండ్‌లో శ్రీకాంత్.. హు యున (హాంకాంగ్‌)తో తలపడనున్నాడు. ఐదో సీడ్‌ శ్రీ కాంత్‌కు యునపై 2-1తో మెరుగైన రికార్డు ఉన్నా.. వరల్డ్‌ చాంపియనషి్‌ప్సలో శ్రీకాంతపై యున విజయం సాధించాడు. మరో షట్లర్‌ అజయ్‌ జయరామ్‌.. ఆరంభ రౌండ్‌లోనే టాప్‌ సీడ్‌ చెన లాంగ్‌తో తలపడనున్నాడు. క్వాలిఫయర్‌తో హెచఎ్‌ప ప్రణయ్‌ ఆడనున్నాడు. అయితే కండర గా యంతో పారుపల్లి కశ్యప్‌ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇక మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడీ .. నకో ఫుకుమన-కరుమి యొనో (జపాన) జంటతో తలపడనుంది.

No comments:

Post a Comment