- వారియర్స్‌తో రెండో మ్యాచ్ రేపు
- ఒత్తిడిలో సచిన టీమ్
- సిరీస్‌పై వార్న్ సేన గురి
- ఆల్ స్టార్స్ టీ-20 సిరీస్
- గురువారం ఉదయం 7:30 గంటలకు స్టార్ స్పోర్ట్స్ 2, 3లో
అగ్రరాజ్యం అమెరికాను అలరించేందుకు ఆల్ స్టార్స్ మరోసారి రెడీ అవుతున్నారు. ఆల్ స్టార్స్ సిరీస్‌లో భాగంగా సచిన బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ మధ్య రెండో టీ-20 మ్యాచకు రంగం సిద్ధమైంది. మూడు మ్యాచల సిరీ్‌సలో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ-20 టెక్సాస్ రాష్ట్రం హూస్టన్‌లోని మినిట్ మెయిడ్ స్టేడియంలో బుధవారం (భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7:30 గంటలు) రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన దిగ్గజ ఆటగాళ్లతో ఈ సిరీ్‌సను నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ వేదికగా శనివారం జరిగిన తొలి టీ-20 అమెరికా వాసులను విశేషంగా అలరించింది. ఈ మ్యాచలో సచిన బ్లాస్టర్స్‌పై వార్న్ వారియర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీ్‌సలో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో మ్యాచలో నెగ్గి సిరీ్‌సను సమం చేయాలని సచిన నేతృత్వంలోని బ్లాస్టర్స్ యోచిస్తోంది. తద్వారా సిరీస్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. దీంతో సచిన టీమ్‌పై ఒత్తిడి అధికంగా ఉంది. మరోవైపు హూస్టన మ్యాచలో నెగ్గి సిరీ్‌సను దక్కించుకోవాలని వార్న్ వారియర్స్ కూడా భావిస్తోంది. అయితే.. సచిన సేన సిరీస్ సమం చేస్తుందో లేక.. వార్న్ టీమ్‌ను విజయం వరిస్తుందో చూడాలి.
గంగూలీకి చాన్స్..!: సచిన బ్లాస్టర్స్‌ను బ్యాటింగ్ సమస్య వేధిస్తోంది. లక్ష్మణ్, బ్రియాన లారా, కార్ల్ హూపర్ బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. మహేల జయవర్దనె కొద్దిసేపు ప్రతిఘటించినా భారీ స్కోరు సాధించలేకపోయాడు. దీంతో బ్లాస్టర్స్ 20 ఓవర్లు ముగిసే సరికి 140/8కే పరిమితమైంది. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాన్ని బ్లాస్టర్స్ మిడిలార్డర్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. రెండో మ్యాచలోనైనా బ్యాట్స్‌మెన రాణించాలని బ్లాస్టర్స్ శిబిరం ఆశిస్తోంది. తొలి మ్యాచలో బరిలోకి దిగని సౌరవ్ గంగూలీని రెండో టీ-20లో ఆడించే అవకాశాలున్నాయి. కాగా, రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన, జాక్ కలిస్, సంగక్కర, ఆండ్రూ సైమండ్స్, జాంటీ రోడ్స్ వంటి హేమాహేమీలతో కూడిన వారియర్స్ బ్యాటింగ్‌ను కట్టడి చేయాలంటే బ్లాస్టర్స్ బౌలర్లు కూడా మరింత చెమటోడ్చాలి.
తొలి మ్యాచ్‌లోఓడినప్పటికీ బ్లాస్టర్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగానే ఉంది. ఆ జట్టులోని ఆటగాళ్లు బాగా కష్టపడుతున్నారు. హూస్టనలో బ్లాస్టర్స్ పుంజుకుంటుంది. మాకు గట్టి పోటీ ఎదురవుతుందనే భావిస్తున్నా
No comments:
Post a Comment