పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

48 శాతం తగ్గిన ఎన్‌ఎండిసి లాభాలు

దేశీ ముడి ఇనుము ఉత్పత్తి దిగ్గజం ఎన్‌ఎండిసి.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో అమ్మకాలు భారీగా పడిపోవటంతో నికర లాభం ఏకంగా 48 శాతం క్షీణించి 810.24 కోట్ల రూపాయలకు పడిపో యాయి. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం 1,566.75 కోట్ల రూపాయలుగా ఉంది. సమీక్షా కాలంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన కంపెనీ మొత్తం రాబడులు కూడా 48 శాతం క్షీణతతో 3,105.05 కోట్ల రూపాయల నుంచి 1,602.23 కోట్ల రూపాయలకు పడిపోయాయి.
 
త్రైమాసిక కాలంలో డిస్ట్రి‌క్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌, నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌ ఫండ్‌కు 135.96 కోట్ల రూపాయల సాయాన్ని ఎన్‌ఎండిసి అందించింది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం కారణంగా డిమాండ్‌ అంతగా లేకపోవటం పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని కంపెనీ తెలిపింది. అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ముడి ఇనుము ఉత్పత్తి ధరలను ఎన్‌ఎండిసి ఏకంగా 52 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే

No comments:

Post a Comment