పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

సువెన్‌ లాభం రూ.25 కోట్లు

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గాను 24.72 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసుకున్నట్లు సువెన్‌ లైఫ్‌సైన్సెస్‌ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం 24.83 కోట్ల రూపాయలు. అమ్మకాలు 16.49 శాతం క్షీ ణించి 139.83 కోట్ల నుంచి 116.76 కోట్ల రూపాయలకు తగ్గటంతో పనితీరుపై ప్రభావం పడిందని పేర్కొంది. సమీక్షాకాలంలో ఆర్‌ అండ్‌ డి కార్యకలాపాల కోసం 31 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు సువెన్‌ తెలిపింది. మొత్తం రాబడుల్లో ఇది 13.56 శాతం. త్రైమాసిక కాలంలో ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలోని జెఎన్‌పిసిలో నెలకొల్పిన ప్లాంట్‌ వాణిజ్యపరమైన కార్యకలాపాలను ప్రారంభించిందని తెలిపింది. అలాగే అమెరికాలోని డెలావర్‌లో కంపెనీ సొంత అనుబంధ సంస్థ సువెన్‌ ఇంక్‌... అక్టోబర్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభించిందని సువెన్‌ వెల్లడించింది. మంగళవారం బిఎ్‌సఇలో సువెన్‌ లైఫ్‌ షేరు 1.51 శాతం లాభంతో 268.30 వద్ద స్థిరపడింది

No comments:

Post a Comment