పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

వోడాఫోన్‌ను ఆదుకున్న డేటా ఆదాయం

వోడాఫోన్‌ ఇండియా సెప్టెంబర్‌, ముగిసిన ఆరు నెలలకు రూ.6,534 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 6.3 శాతం ఎక్కువ. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 11.2 శాతం పెరిగి రూ.22,902 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆరు నెలల్లో కంపెనీ డేటా ఆదాయం 55.9 శాతం పెరిగి రూ.3,979 కోట్లకు చేరింది. ఈ సంవత్సరం డిసెంబర్‌ నాటికి ఐదు సర్కిల్స్‌లో 4జి టెలికాం సేవలు ప్రారంభిస్తామని వోడాఫోన్‌ ఇండియా ఎండి, సిఈఒ సునీల్‌ సూద్‌ చెప్పారు.వెల్లడించారు. పబ్లిక్‌ ఇష్యూ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. గత ఆరు నెలల్లో డేటా ఆదాయం బాగా పెరిగినట్టు చెప్పారు. కంపెనీ అప్పులు రూ.76,800 కోట్లకు చేరాయి. ఏదైనా టెలికం కంపెనీని టేకోవర్‌ చేసే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు వోడాఫోన్‌ ఇండియా సిఈఒ సమాధానం దాట వేశారు.

No comments:

Post a Comment