పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

నాగచైతన్య 'మజ్ను'

Naga Chaitanya
ఈ ఏడాది మే 29న మలయాళంలో రిలీజ్‌ అయిన 'ప్రేమమ్‌' సినిమా ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేయడంతో పాటు బాక్స్‌ ఆఫీసు దగ్గర కూడా కాసుల వర్షం కురిపించి మలయాళ ఇండస్ట్రీలో టాప్‌ గ్రాసర్‌గా నిలిచచింది. ఇదే సినిమాని తెలుగులో అక్కినేని ఫ్యామిలీ హన్డ్సం హీరో నాగ చైతన్యతో రీమేక్‌ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగాఉన్న ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్‌ అప్డేట్స్‌ మీకందిస్తున్నార. నవంబరు చివరి వారంలో నాగచైతన్య మజ్ను సినిమాని అధికారికంగా లాంచ్‌ చేయనున్నారు. అలాగే అదే వారం నుంచే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ని కూడా మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్‌ ఉంటారు. అందులో ఒకరిగా ఒరిజినల్‌ వెర్షన్‌లో చేసిన అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేసారు. ప్రస్తుతం మరో ఇద్దరు హీరోయిన్స్‌ కోసం పలువురిని పరిశీలిస్తున్నారు. నాగచైతన్య ప్రస్తుతం గౌతమ్‌ మీనన్‌ డైరెక్షన్‌లో చేస్తున్న 'సాహసమే శ్వాసగా సాగిపో సినిమా షూట్‌లో ఉన్నాడు. నవంబరు 10 లోపల ఈ సినిమా షూట్‌ పూర్తయిపోతుంది. ఆ తర్వాత మజ్ను కోసం తన లుక్‌ మార్చుకొని నవంబరు చివరరి నుండి షూట్‌ మొదలు పెడతారు.

No comments:

Post a Comment