శ్రీరామ్, రాయ్ లక్ష్మి, సుమన్, వడివుక్కరసి ముఖ్యపాత్రదారులుగా రూపొందుతున్న చిత్రం 'శివగంగా'. కుమార్‌బాబు సమర్పణలో ఎక్సెల్ల క్రియేషన్స్ బ్యానర్‌పై వి.సిరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
'అరుందతి', 'కాంచన', 'చంద్రముఖి', 'చంద్రకళ' చిత్రాల తరహాలో ఈ సినిమా పర్రర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. తెలుగు, తమిళంలో విడుదల సన్నాహాలు జరుపుకున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని నవంబరు 7న సినీ రంగ ప్రముఖుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా...చిత్ర సమర్పణలు కుమార్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు తమిళంలో పర్రర్ చిత్రాలకు మంచి ఆధరణ లభిస్తుంది. అదేవిధంగా మా 'శివగంగ' చిత్రం కూడా పర్రర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్‌తో పై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాని రూపొందిస్తున్నాం. అన్నీ కమర్షియల్ పరుగులతో ఊహించని ట్విస్ట్‌లతో సినిమా సాగుతుంది. రెండు ఆత్మల ప్రతీకారం తీర్చుకోవడమనే కాన్సెప్ట్‌తో సినిమా సాగుతుంది. తెలుగు తమిళ ప్రేక్షకులకు సుపరితుడైన నటుడు శ్రీరామ్ ఇందులో శివ, శక్తి అనే రెండు రోల్స్‌ను పోషిస్తున్నాడు. అలా రాయ్ లక్ష్మి కూడా గ్లామర్‌తో పాటు పెర్మార్మెన్స్‌తో సత్తా చాటనుంది. 37 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఈ చిత్రానికి పైలైట్ అవుతాయి. సీనియర్ నటుడు సుమన్ నెగిటివ్ రోల్స్‌లో నటిస్తున్నారు. నవంబరు 7న పాటలను విడుదల చేస్తున్నా.ం సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని త్వరలోనే రెండు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. నిర్మాత కె.శివనాద్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మా సంస్థ నుండి తొలి చిత్రంగా రానున్న భారీ బడ్జెట్ మూవీ 'శివగంగ' పర్రర్, యాక్షన్ విత్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ మూవీ రూపొందుతుంది. శ్రీరామ్, రాయ్ లక్ష్మి, సుమన్, వడివుక్కరసి, తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్: కణల్ కన్నన్, సంగీతం: జన్‌పీర్, కెమెరా: ఎస్.శ్రీనివాసరెడ్డి, మాటలు: ఎం.రాజశేఖర్‌రెడ్డి, పాటలు: వనమాలి, వెలిదండ్ల, ఎడిటర్: ఎలీనా, ఆర్ట్: దేవరాజ్, నిర్మాతలు: కె.శివనాద్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శకత్వం: విసివడి ఉడయాన్.
No comments:
Post a Comment